న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘దసరా ‘ మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ గా ఉంది , దసరా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడం పూర్తిస్థాయి డీ గ్లామర్ లుక్ లో నాని కనిపించడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలవుతోంది. శ్రీరామనవమి రోజునే రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నాని ఆశలు పెట్టుకున్నాడు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. దేశవ్యాప్తంగా నాని చేసిన ప్రమోషన్స్ తో ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం యూఎస్ లో ప్రీ సేల్స్ నుండి 200k డాలర్ల మార్క్ ను అధిగమించింది.
అమెరికాలో నానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమా ఫస్ట్ వీకెండ్‌లో సాలిడ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్ బాగానే ఉంటుంది.నాని కి తన కెరీర్ లో జెర్సీ సినిమా అమెరికా లో 2 మిలియన్ డాలర్ ల మార్క్ ని అందుకున్న సినిమా గా రికార్డు లో ఉంది, మరి దసరా ఆ మార్క్ ని సాధించాలి అంటే కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం చాల ఈజీ గా దాటేస్తుంది. నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహాబ్, సాయికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.