Karthika Deepam2 April 17 Episoide 21:పారిజాతానికి అబద్దం చెప్పిన బంటు.. దీప దరిద్ర దేవత అన్న అనసూయ.. సౌర్య ని ఖుషి చేసిన కార్తీక్ ..

Posted by uma, April 17, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Karthika Deepam 2: పారిజాతం దీపతో మాట్లాడిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ దీప చాలా డేంజర్ ఎట్లాగైనా దాంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి బంటు వస్తాడు అసలు ఈ దీపాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావట్లేదు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. బంటు పారిజాతంతో నేను దీప ని గజగజ వనికించేశానని, ఆదీప నన్ను చూసి భయపడింది అమ్మ అని చెప్తాడు దానికి పారిజాతం ఏంటి నువ్వే దీపని గజగజ వనికిచావా అని అంటుంది. అవునమ్మ గారు నిజమే చెప్తున్నాను అని అంటాడు దానికి పారిజాతం ఈ ఇంటికి మెయిన్ పిల్లర్ లాంటి దాన్ని నన్నే అది పూచిక పొలాల తీసి పడేసింది అట్లాంటిది నువ్వు దాన్ని గజగజ వనికించావు అంటే నేను నమ్మాలా రా అని అంటుంది. అమ్మ నేను గుడి బయట పోతురాజు లాంటి వాడిని నన్ను చూస్తే భయపడాల్సిందే అని అంటాడు. నువ్వు పోతురాజు అయితే అది గుడిలోని అమ్మోరు లాంటిది అలాంటి దాన్ని చూస్తే నీలాంటి పోతురాజులు ఎంత మంది వచ్చినా ఉనికి పోవాల్సిందే అని అంటుంది పారు. ఇచ్చిన బిల్డప్ చాల్లే గజ గజ వనిగించేసాడంట నాకు చెప్తున్నాడు అని పారిజాతం బంటు ని తిట్టే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా అని బంటు మనసులో అనుకుంటాడు.

ఇక కార్తీక్ జోస్నా ఇద్దరు షాపింగ్ కి వెళ్లేందుకు బయటకు వస్తారు అప్పుడే అక్కడ శౌర్య కార్ ని చూస్తూ ఉంటుంది. కార్తీక్ జోష్నా ఇద్దరు సౌరి ఏం చూస్తుందా అని అనుకుంటారు ఇక దగ్గరికి వెళ్లి ఏం చూస్తున్నావ్ రౌడీ అని అడుగుతాడు కార్తీక్, కారులో కిటికీ చూస్తున్నాను కార్తీక్ అని అంటుంది. కారులో కిటికీ ఎక్కడుంది అని అంటే అదిగో అది ఉంది కదా అది కిటికీ కదా అని సన్ రూఫ్ ని చూపిస్తుంది. అది చూసి కార్తీక్ అది సన్రూఫ్ కిటికీ కాదు అని అంటాడు నేను కిటికీ అని అంటాను అని అంటుంది శౌర్య సరే అంటాడు కార్తీక్, శౌర్య నేను కారెకత్ అని అడుగుతుంది ఇప్పుడు కాదు మేం బయటికి వెళ్తున్నాం వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటుంది జోష్నా, నేను మీతో పాటు రావచ్చా అని అడుగుతుంది శౌర్య. ఇప్పుడు కాదులేవే మేమేం షాపింగ్ కి వెళ్తున్నామని అంటుంది నేను మీతో వస్తాను అని అడిగితే ఇక కార్తీక్ పాపమ్ అంత వస్తే ఇబ్బంది ఏముంది అని అంటాడు. సరే రౌడీ నువ్వు మాతో పాటు వద్దు గానివి వెళ్లి బొమ్మలు పెట్టేసి అమ్మకు చెప్పేసి రా అని అంటాడు.

కార్తీక్ చెప్పిన సౌరి మాత్రం అక్కడే ఉంటుంది అదేంటి మీ అమ్మకు చెప్పి రా అంటే చెప్పకుండా ఇక్కడ ఉన్నావు అని అంటాడు. నేను మా అమ్మ పడుకోవట్లేదు మా మధ్య గొడవ అయింది అని అంటుంది శౌర్య. అయితే సైగ చేసి రా అని అంటాడు కార్తీక్ సైకిల్ కూడా మానేశాం కార్తీక్ మేమిద్దరం చూసుకోవట్లేదు అని అంటుంది ఇప్పుడు ఏం చేయాలి మరి అని అంటే నువ్వు వెళ్లి మా అమ్మతో చెప్పు మా అమ్మ ఒప్పుకుంటే నేను నీతో పాటు కార్లో వస్తాను అని అంటుంది. ఇక కార్తీక్ భయపడతాడు. జోష్న కూడా వెళ్లి చెప్పేసి రా కార్తీక్ అని అంటుంది. కార్తీక్ వెళ్లడానికి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. కానీ సారీ కోసం వెళ్లి చెప్పాలి అని అనుకొని దీప దగ్గరికి వెళ్తాడు. డోర్ కొట్టమని కార్తీక్ కి జోష్నా సౌర్య ఇద్దరు దూరం నుంచి సైగ చేస్తారు. ఇక్కడ సీన్ భలే కామెడీగా ఉంటుంది. ఇక కార్తీకదీపం దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు దీప శౌర్య అనుకొని కోపం పోయిందా లోపలికి రా అని అంటుంది నేను కార్తీక్ అని చెబుదామనుకొని కాదులే అని మళ్లీ డోర్ కొడతాడు. కార్తీక్ డోర్ కొడుతూ ఉంటే సౌర్య అనుకొని వచ్చి తలుపుతీస్తుంది దీప కార్తీకం చూసి మీరేంటి బొమ్మను తీసుకొచ్చారు అని అడుగుతుంది. నేను సూర్యుని నాతో పాటు బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా అని అంటాడు ఎక్కడికి అని అడుగుతుంది నేను జోష్ణ షాపింగ్ కి వెళ్తున్నాము మాతోపాటు సౌర్యం తీసుకెళ్తామని అంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది తను ఆశపడుతుంది అని అంటాడు కార్తీక్. మీతో పంపించడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది దీప ఒకసారి తనను చూసి ఆ మాట చెప్పు అని అంటాడు అప్పటికే శౌర్య కారు దగ్గరికి వెళ్లి నిలబడి చూస్తూ ఉంటుంది పక్కనే జోష్న కూడా ఉంటుంది. తన సంతోషంగా ఉంటుందని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం అని అంటాడు. ఇక కార్తీకదీపం ఒప్పిస్తాడు దీప సరే తీసుకువెళ్లండి అని అంటుంది. కానీ అక్కడ మాత్రం మీరు బట్టలు కొని పెట్టకూడదు అని అంటుంది సరే అంటాడు కార్తీక్. ఇంత తొందరగా మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు అని అంటాడు మీరు ఇక నుంచి తొందరగా వెళ్లాలంటే నేను ఇదే కదా చేయాల్సింది అని అంటుంది కోపంగా, ఇప్పటికైనా క్షమిస్తారని అనుకుంటున్నాను అని అంటేకార్తీక్ మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళండి అని అంటుంది. దీప శౌర్య విలకి రాను రాను దగ్గర అయిపోతుంది అని మనసులో అనుకుంటుంది. కార్లో ఎక్కి దీపకే బాయ్ చెప్తుంది కార్తీక్ ఒడిలో కూర్చొని సౌర్య. ఈ ఆనందాలకు ఇంటి దగ్గర అయిపోతే రేపొద్దున చాలా కష్టమైపోతుంది అని అనుకుంటుంది దీప.

ఇక మరోవైపు మల్లేష్ ఇంట్లో పని చేసుకుంటూ అనసూయ తనకు తానే తిట్టుకుంటూ ఉంటుంది అనసూయ మల్లేష్ రాగానే తిడుతుంది నాకు తమలపాకులకు డబ్బులు ఇస్తానన్న ఇవ్వలేదు అని అంటే నేను ఇవ్వను అని అంటాడు దానితో అనసూయ నోరు వేసుకొని అరుస్తుంది వెంటనే మల్లేష్ ఇల్లు బెదిరిస్తాడు నీకు రెండే రోజులు టైం ఇస్తున్నాను డబ్బివ్వకపోతే నువ్వు రోడ్డు మీద పడాల్సిందే అని మల్లేష్ వార్నింగ్ ఇస్తాడు. అనసూయ మనసులో దీపావళి మూడు రోజులవుతుంది కనీసం అక్కడ ఏం జరుగుతుందో ఫోన్ కూడా చేసి చెప్పట్లేదు దీని పెంచిన నా తమ్ముడికి దండం పట్టుకుంది పట్టుకున్న నా కొడుక్కి దరిద్రం పట్టుకుంది కోడలుగా తెచ్చుకున్న నాకు దరిద్రం పట్టుకుంది ఇది పెద్ద దరిద్ర దేవత అని మనసులో తిట్టుకుంటుంది. అయినా సౌర్య హైదరాబాద్ వెళ్ళింది వాళ్ళ నాన్న కోసమే కదా వాళ్ళ నాన్న చూసే ఉంటుందా చూసే ఉంటుంది వాళ్ళ నాన్నతో పాటు హైదరాబాదు అంత చెక్కలు కొడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది.

ఇక కార్తీక్ వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు ఇక శౌర్య సన్ రూఫ్ పై నిలబడి అంతా చూస్తూ ఉంటుంది రౌడీ ఇప్పుడెలా ఉంది అని అంటాడు చాలా బాగుంది కార్తీక్ ఇక్కడ నిలబడి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇక కార్తీక్ జోష్న ఇద్దరు సౌర్యం చూసి సంతోషిస్తారు చాలా ఆనందంగా కారులో ఎక్కి వెళ్తూ ఉంటుంది రాకాసి గడుసు పిల్ల అనే పాటను ప్లే చేస్తూ ఉంటారు. గల్లీ రౌడీ ఇప్పుడు ఆనందిస్తుంది అని అంటాడు కార్తీక్. ఇక అందరూ షాపింగ్ మాల్ దగ్గర దిగుతారు కార్తీక్ లోపలికి వెళ్తూ ఉంటే కిటికీ చాలా బాగుంది కార్తిక్ ఆ రంగులరాట్నం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని అంటుంది. కారు నేమో రంగులరాట్నం ఏమో కిటికీ చేసేసావా ఇక ముందు ముందు చేస్తావో రౌడి అని అంటాడు. నేను అటు వెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటాను రా కార్తీక్ అని చేయి పట్టుకుని తీసుకొని వెళుతుంది జోష్న మా అమ్మ నన్ను తీసుకెళ్లినట్టు జోష్న కార్తీకం తీసుకెళ్తుంది తప్పిపోతాడేమో అని అనుకుంటుంది శౌర్య. ఇక అప్పుడే ఒక పిల్ల బట్టలు చూస్తూ ఉంటుంది బట్టలు అమ్మాయికి కనిపించవు దాంతో నాన్న అని పిలుస్తుంది వాళ్ళ నాన్న వచ్చి ఏంటమ్మా అని అడిగితే బట్టలు కనిపించట్లేదు అని అంటే వాళ్ళ నాన్న ఎత్తుకొని చూపిస్తాడు. ఇక అప్పుడే సౌరి కూడా మనసులో నాకు బట్టలు కనిపించట్లేదు నేను నాన్న అంటే మా నాన్న వచ్చి చూపిస్తాడా అని అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడే కార్తీక్ వచ్చేసి ఎవరిని ఎత్తుకుంటాడు అక్కడ సారీ చాలా సంతోషిస్తుంది ఆ సీన్ చాలా బాగుంటుంది.

ఇప్పుడు చూడు రౌడీ నీకు కూడా బట్టలన్నీ కనిపిస్తాయి అని అంటాడు. అప్పుడే ఆ పక్కన పాప ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది ఆ డ్రెస్ నాకు బాగుంటుందా కార్తీక్ అని అడుగుతుంది శౌర్య బాగుంటుంది రౌడీ తీసుకుంటావా అని అంటాడు నాకు అడ్రస్ చాలా నచ్చింది కార్తీక్ అని అంటుంది సరే మీ పాప సైజు డ్రెస్ ని సెలెక్ట్ చేసి పంపించండి అని అంటాడు కార్తీక్. కార్తీక్ సవరణ కిందకు దింపి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా నీకు ఆ డ్రెస్సే మనం కూడా తీసుకుంటున్నాం అని అంటాడు ఈ లోపు శౌర్య ఇంకేమైనా బట్టలు చూసుకోవడానికి ఉన్నాయేమో వెళ్తుంది జోష్నా కార్తీక్ ని పిలుస్తుంది కార్తీక్ జోష్ణ దగ్గరికి వెళ్తాడు . సౌర్య బట్టలన్నీ తనకి నచ్చినవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి నరసింహ భార్య శోభ వస్తుంది. శోభ సౌర్యను చూస్తుంది నువ్వే కదా ఆరోజు పూలు కోసిన పిల్లవి అని అంటుంది శౌర్య భయపడుతూ ఉంటుంది.

466 views