Game Changer:రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆ వెంకటేష్ సినిమాకి రీమేకా..?

Posted by venditeravaartha, May 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Ram Charan : టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’. #RRR తర్వాత సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమా కావడం వల్లనే ఈ ప్రాజెక్ట్ కి ఇంత క్రేజ్ ఏర్పడింది. అయితే మధ్యలో శంకర్ ఇండియన్ 2 కూడా చెయ్యాల్సిన అవసరం రావడం తో ‘గేమ్ చేంజర్’ షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘జరగండి..జరగండి’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రామ్ చరణ్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ని కుదిపేస్తుంది. ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, పొలిటికల్ నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా థీమ్ అప్పట్లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జయం మనదేరా’ కి పోలికగా ఉంటుందట.

ఇదే ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్న వార్త. ఒక సినిమాని పోలినట్టుగా ఒక సినిమా ఉండడం కొత్తేమి కాదు. కానీ స్క్రీన్ ప్లే విషయం లో మ్యాజిక్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి. అలాంటి అద్భుతాలను సృష్టించడం లో శంకర్ సిద్ధహస్తుడు. కాబట్టి అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా, ప్రజా నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

287 views