Chiranjeevi :చిరంజీవితో పెళ్లికి ముందు సురేఖకి ఆ హీరోతో పెళ్లి చేయాలని అనుకున్నారా?

Posted by uma, April 17, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Mega Star Chiranjeevi & Surekha : మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరోగా ఎదిగారు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సెటిల్ అయ్యారు. చిరంజీవి కుటుంబంలోనే ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మెగాస్టార్ కి బయటే కాక కుటుంబంలో కూడా సపోర్టుగా నిలిచేవారు ఆయన భార్య సురేఖ. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇతర జీవితం ఇంతకాలం అన్యోన్యంగా సాగింది అంటేనే వాళ్ళ బాండింగ్ అర్థం చేసుకోవచ్చు. అయితే నిజానికి సురేఖకు ఆమె తండ్రి అల్లు రామలింగయ్య ముందుగా ఒక సంబంధం చూశారుట, చిరంజీవి గారి కన్నా ముందు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారుట.

అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారట చిరంజీవి గారు. అయితే చిరంజీవికి తన బిడ్డనిస్తే బాగుంటుందా లేదా అని మొదట అల్లు రామలింగే సందేహించారు వెంటనే ఈ విషయాన్ని చిరంజీవి దగ్గర కూడా ప్రస్తావించారట అయితే చిరంజీవి గారు అప్పటికి ఇండస్ట్రీలో తొలి అడుగులు వేస్తూ ఉన్నారు. అల్లు రామలింగయ్య అంత పెద్ద వాళ్ళు అడగడంతో చిరంజీవి గారు ఓకే చెప్పేశారు. అప్పటికి అల్లు రామలింగయ్య గారు అంటే ఒక పేరు ఒక ప్రఖ్యాత తెలుగు ఇండస్ట్రీలోనే మంచి కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది. ఆయన కొడుకు అల్లు అరవింద్ కూడా సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు నిర్మాతగా ఎదగడానికి పునాదులు వేసుకుంటున్నారు.

ఇక అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ కోసం,ఒక సంబంధం చూసారు ట,అదే కలెక్టర్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కలెక్టర్ అంటే అప్పట్లో మాటలేం కాదు కలెక్టర్ సంబంధం చేసుకోవడం అప్పట్లో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ గా ఫీల్ అయ్యేవారు ఇక అలాంటి గొప్ప సంబంధానికి ఇవ్వాలా లేదంటే ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి గారికి ఇవ్వాలని చాలా రోజులు సతమతమయ్యారుట అల్లు రామలింగయ్య గారు. ఎటు తేల్చుకోలేక సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్లి తన మనసులో ఉన్న మాటని చెప్పాడు ఆయన సలహా తీసుకుందామని స్నేహితున్ని అడగడంతో ఆయన ముందు సురేఖ అభిప్రాయం తెలుసుకొని ఆమెకు ఎవరు నచ్చారో వారికి ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇచ్చారట ప్రభాకర్ రెడ్డి ఇక అల్లు రామలింగయ్య గారు కూడా అదే కరెక్ట్ అనుకోని సురేఖ గారిని అడిగారుట, నీకు ఎవరంటే ఇష్టముంటే వాళ్లతో పెళ్లి చేస్తామని కలెక్టర్ సంబంధం చిరంజీవి సంబంధం చెప్పారట, దాంతో సురేఖ చిరంజీవి గారిని మెచ్చి ,నచ్చి చిరుతో 1980 ఫిబ్రవరి 20న అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత చిరంజీవి అల్లు రామలింగయ్య గారి బ్యానర్ గీత ఆర్ట్స్ ద్వారా చాలా సినిమాలను తరికెక్కించారు భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. చిరంజీవి గారు ఎదిగేందుకు గీత ఆర్ట్స్ చాలా ఉపయోగపడిందని ఎదిగేందుకు చాలా హెల్ప్ చేశారని కూడా ఇండస్ట్రీలో టాక్, ఏది ఏమైనా చిరంజీవి గారుని మెచ్చి నచ్చి చేసుకున్న సురేఖ గారు ఇప్పటికీ చిరంజీవి గారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. చిరంజీవి గారి పెద్ద కుటుంబం ఇప్పటికీ అంతా అన్యోన్యంగా ఉంటుందంటే దానికి కారణం సురేఖ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సురేఖ గారు చిరంజీవితో గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంకరేజ్ చేసి సినిమాల్లోకి రావడానికి కారణమయ్యారని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఉమ్మడి కుటుంబాన్ని ఒక తాటి మీద తీసుకురావడం సురేఖ గారికే సాధ్యమని చెప్పొచ్చు.ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నారు .

454 views