Brahmamudi:ఆఫీసులో తన బుద్ధి బయట పెట్టుకున్న రాహుల్.. అపర్ణకు అవమానం.. పుట్టింటికి కావ్య..

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Brahmamudi April 10 2024 episode 380: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో, రాజ్ ఎండి పదవిని కళ్యాణ్ కి ఇవ్వడంతో కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్తాడు రాహుల్ జెంటిల్ మేనేజర్ గా ఆఫీస్ కి వెళ్తాడు వాళ్ళిద్దరి కోసం అనామిక, స్వప్న ఇద్దరు గ్యారేజ్ రెడీ చేస్తూ ఉంటారు. ఒకరిని మించి ఇంకొకరు క్యారేజీస్ పెద్దపెద్దవి తీసుకొని వెళ్తారు ఇక అక్కడికి వచ్చినా కావ్య వాళ్ళని చూసి ఏంటివి అని అడుగుతుంది. ఎవరికి అక్క గ్యారేజీ అని అడుగుతుంది ఇది రాహుల్ కి అంటుంది స్వప్న ఇది కళ్యాణ్ కోసం అంటుంది అనామిక మిగిలింది అన్నదానానిక అంటుంది కావ్య జెండర్ మేనేజర్ భార్య ఎంత పెద్ద క్యారేజీ తీసుకు వెళ్తే ఎండి భార్య నేనంత తీసుకెళ్లాలి అని అంటుంది అనామిక ఎంత పెద్ద క్యారేజీ తీసుకెళ్లినా తినేది ఒకరే కదా అంటుంది కావ్య. ఆ విషయం నాతో కాదు స్వప్నతో చెప్పు అని అంటుంది స్వప్న నాతో కాదు అనామికత చెప్పు అంటుంది. ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక మీరు ఇక్కడే గొడవ పడుతూ ఉంటే వారి బయట నుంచి తెప్పించుకొని తింటారులే అని అంటుంది కావ్య లేదు అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు.

అనామిక స్వప్న ఇద్దరు వెళ్లడాన్ని మెట్లు దిగుతూ చూస్తుంది రుద్రాణి ఇక వాళ్ళు వెళ్లడం గమనించి కావి దగ్గరికి వచ్చి ఎలాగైనా కావ్యని బాధపెట్టేటట్లు మాట్లాడాలనుకుంటుంది. కావ్య తినడానికి ఏమీ లేక మంచినీళ్లు తాగి వెళ్లాలని నీళ్ళు గ్లాసులో పోసుకుంటూ ఉండగా రుద్రాణి వచ్చి ఏంటి అంతా తీసుకెళ్ళారా అని అంటుంది. ఆ పర్వాలేదు లెండి అంటుంది కావ్య ఏంటో నీకు ఈ కర్మ అని అంటుంది రుద్రణి అప్పుడే రాజు పైనుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇప్పుడు నా కర్మకి ఏమైంది అని అంటుంది కావ్య బాలింతరాలయిందిలే అని అంటుంది రుద్రాణి, ఉంగా, ఉంగా అంటూ ఇల్లంతా తిరుగుతుంది అని అంటుంది.ఒకప్పుడు రాజ్ మహారాజు లాగా ఆఫీస్ లో ఉంటే నువ్వు రానిలాగా క్యారేజీ తీసుకువెళ్లే దానివి ఇప్పుడు రాజ్ రాజీ పడ్డాడు. నీ తోడికోడలు నా కోడలు కలిసి క్యారేజీ మోసుకెళ్తుంటే నీ మనసు చినిగించుకోవడం లేదా అని అడుగుతుంది. రాజ్ ప్లేస్ లోకి కవి గారు వెళ్లడంతో నీకు బాధగా అనిపించట్లేదా అని అంటే కవి గారు ఎప్పుడో చెప్పేశారు రాముడు రాముడే భరతుడు బర్త్ డే అని నా భర్త స్థానం ఏంటో నాకు తెలుసు అని అంటుంది కావ్య నీ భర్త స్నానం నుంచి తండ్రి స్థానంలోకి వెళ్ళాడు కదా దాని గురించి ఏంటి అని అంటుంది మీరే అంటున్నారు కదా నేను రాజీపడి బతుకుతున్నాను అని అలానే అనుకోండి అని అంటుంది.గతిలేక మతిలేక పడి ఉంటున్నానని మీరు అండం నిజమే మరి అని అంటుంది కావ్య మేమందం సంగతి వేరు నువ్వు ఏమనుకుంటున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావు అని అంటుంది మీకు ఏది గట్టిగా అనిపిస్తే నేను అదే చెప్తాను. అదే మీకు తృప్తిని ఇస్తుంది అనుకుంటే అలానే అనుకోండి అని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు అన్ని విని రాజ్ బాధపడతాడు.

మరోవైపు రాహుల్ ఆఫీస్ లో శృతికి ఎస్బిహెచ్ చేస్తూ ఉంటాడు శృతి నువ్వు వాడే పెర్ఫ్యూమ్ ఏంటి అని అడుగుతాడు దేనికి అని అంటుంది నా భార్య కూడా తీసుకెళ్దాం అని అంటే అలాంటివితీసుకువెళ్తే మీ భార్యని కూడా వేరేవాడు వచ్చి పరిఫ్యూమ్ పేరు అడుగుతాడు అప్పుడు బాగోదు కదా అని బయటికి వెళ్లిపోతుంది శృతి వారం తిరిగేలోపు నేను నా ఒడిలోకి వచ్చేలా చేసుకుంటాను అని రాహుల్ మనసులో అనుకుంటాడు ఇక అనామిక స్వప్న ఇద్దరు క్యారేజ్ తీసుకు రావడం శృతి చూస్తుంది ముందు వారసులు వచ్చారు ఇప్పుడు భారీలు వస్తున్నారు ఏంటో అని అనుకుంటుంది ఇక గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ స్వప్న పేదలు వెళ్తుంది తను మేనేజర్ భార్య నేను ఎండి భార్యని నాకు ముందు గుడ్ మార్నింగ్ చెప్పవా అని అడుగుతుంది అనామిక కొంతమంది బట్టలు రుచిగా వేసుకుంటారు కానీ రుచిగా కనిపించారులే అని కావాలని స్వప్న అనామికకు చురకలు వేస్తుంది. అనామిక కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడని శృతిని అడుగుతుంది శృతి కళ్యాణి ఎండి అని చెప్తుంది అవును ఇండిగా బాధ్యతలు బానే చేస్తున్నాడా అని అంటే బానే చేస్తున్నారు అని అంటుంది ఇక స్వప్న మరి మా ఆయనకు సంగతేంటి అని అంటుంది. మీ ఆయన గురించా అని అంటే మా ఆయనకి గోకడం వచ్చు కదా నేనేమైనా గోకాడ అని అడుగుతుంది స్వప్న అది మీకు ఎలా తెలుసు మేడం అని అంటుంది శృతి నా మొగుడు గురించి నాకు తెలియక ఎవరికి తెలుస్తుందిలే అని అంటుంది స్వప్న మీకు ఇదంతా తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు మేడం అని అడుగుతుంది చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంది స్వప్న ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. స్వప్న శృతి చెప్పిన మాటలు విని రాహుల్ బండారం మొత్తం శృతి ద్వారా తెలుసుకొని రాహుల్ మీద కోప్పడ్డానికి క్యాబిన్ లోనికి వెళ్తుంది ఇక అనామిక కళ్యాణికి లంచ్ బాక్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది.

ఇక కళ్యాణ్ క్యాబిన్లోనికి వెళ్ళినాను మీకు ఆ కళ్యాణ్తో ప్రేమగా మాట్లాడాలని చూస్తుంది నీకోసమే కష్టపడి లంచ్ తీసుకొచ్చాను అని చెప్తుంది. నువ్వు కష్టపడి తీసుకురాలేదులే కానీ ఇంట్లో చేసినవి బాక్స్ లో పెట్టుకుని తీసుకువచ్చావు అంతే కదా అని అంటాడు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళు అని అంటాడు ప్రేమగా మాట్లాడొచ్చు కదా అంటుంది ప్రేమ ఏదో ఒకటే చేయగలను అని అంటాడు కళ్యాణ్ భార్యలకు ఇష్టం లేని పని చేస్తే ఎంత ప్రేమ వస్తుందో అదే నచ్చిన పని చేస్తే మాత్రం మనిషిలా కూడా చూడరు అని అనుకుంటాడు ఇక స్వప్న, రాహుల్ దగ్గరికి వెళ్లి క్యారేజీ తీసుకొని నిలబడుతుంది రాహుల్ నాకోసం బాక్స్ తెచ్చావా అని అంటాడు తెచ్చాక తెలిసింది నేను అనవసరంగా తెచ్చానని అంటుంది. ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి వచ్చిన పని ఏంటి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా ఆడవాళ్లు వెంటపడుతున్నావా అని అంటుంది. నాకు శృతి అంతా చెప్పింది అని అంటుంది అయ్యో అదేం లేదు స్వప్న అని అంటాడు. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని గొడవ పడుతూ ఉంటే అప్పుడే అనామిక వచ్చి అలవాటైన పని కదా స్వప్న రాహుల్ కి అందుకనే అమ్మాయిలు వెంట తిరుగుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు అని అంటుంది. పాపం గ్యారేజ్ తీసుకోకుండా వెళ్లిపోయాడా అని అంటుంది అనామిక స్వప్నతో నువ్వు కూడా తీసుకెళ్ళావు కదా నీ గ్యారేజ్ కూడా వెనక్కి వచ్చింది కదా అని అంటుంది స్వప్న అంటే విన్నావా మా మాటలు అని అంటుంది అనామిక విన్నాను అని అంటుంది స్వప్న భార్యాభర్తలు మాట్లాడుకుంటే వినకూడదని నీకు తెలియదా అని అంటుంది నువ్వు మాత్రమే మాట్లాడుకుంటే మధ్యలో వచ్చే దూరలేదా అని అంటుంది. ఇక ఇద్దరు మళ్లీ గొడవపడడం మొదలు పెడతారు.

ఇక మరోవైపు రుద్రాణి ధాన్యం ఇద్దరూ కలిసి అపర్ణ ను అవమానపరిచేలా మాట్లాడుతుంటారు. రాజు బిడ్డని ఆడిస్తూ ఉంటే ఆ బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు అసలు బాబుకి నామకరణం చేశారు లేదో కనుక్కున్నావా అక్క అని అడుగుతుంది ధాన్యం.ఒకప్పుడు రాజు ఎలా ఉండేవాడు ఇప్పుడు చూడు రాజు పరిస్థితి ఎలా ఉందో అని రుద్రాణి సెటైర్ వేస్తుంది. ఇక ధాన్యం వాళ్లు కనుక నామకరణం చేయకపోతే నువ్వు చేస్తావా ఏంటి అని అడుగుతుంది రుద్రాణి అవును చేస్తాను అంటుంది ధాన్యం అవునా అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నేను లేనప్పుడు నా బిడ్డకు నామకరణం ఎందుకు చేశారంటే ఏం చెప్తావ్ అని అంటుందిఅది కరెక్టే రుద్రాణి నీ విషయం గురించి ఆలోచించలేదు అని అంటుంది ఆ వాళ్ళ మాటలన్నీ విని అపర్ణ ఇన్సెల్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజ్ సైలెంట్ గా ఉంటాడు ఇకరాజ్ బిడ్డ తల్లిని తీసుకువస్తే కావ్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది రుద్రాణి. దానికి వెంటనే ధాన్యం ఏముంది కావ్య సైలెంట్ గా వెళ్ళిపోతుంది లేదంటే కలిసి ఉంటుంది అని అంటుంది వెంటనే రుద్రాణి అలా ఎందుకు కలిసి ఉంటుంది కోర్టుకు వెళ్లి ఇంట్లో అందరినీ బయట పడేసేలా చేస్తుంది అని అంటుంది. ఇక అపర్ణ గట్టిగా మీరిద్దరూ ఆపుతారా అని అంటుంది మీరు అసలు బంధువుల రాబందులా ఏంటి అని అడుగుతుంది. నేనేమన్నాను వదిన నీకు మంచి చేయాలని చూసినా మా మీద అలా మాట్లాడుతున్నావు అని అంటే మీకు అసలు సిగ్గులేదు అని అంటుంది. తప్పు చేసిన రాజుని ఏమీ అనవు కానీ మా మీద మాత్రమే ఇచ్చి కొడతావు అని అంటుంది రుద్రాణి ఇక అక్కడి నుంచి అసహనంగా లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ.

ఇక మరి వైపు కావ్య బయటికి వెళ్తూ ఉంటే ఇందిరా దేవి ఎక్కడికి అని అడుగుతుంది కావ్య సమాధానం చెప్పదు దాంతో ఇందిరా దేవికి అర్థం అయిపోయి సరే వెళ్లి రా అని అంటుంది ఇక వెన్నెల కోసం శ్వేత ని కలవడానికి వెళుతుంది కావ్య, వెన్నెల ఎక్కడ ఉందో కనిపెట్టాలని శ్వేతతో అంటుంది రాజ్ అంటే వెన్నెలకు చాలా ఇష్టం అని వెన్నెల ఫ్యామిలీ ఒకప్పుడు కష్టాల్లో ఉంటే రాజు వాళ్లకు సహాయం చేశాడని అంతవరకే తెలుసు నాకు ఆ తర్వాత వెన్నెల ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది శ్వేత అయితే వెన్నెల అడ్రస్ మనం కనిపెట్టాలి అని ఉంటుంది దానికి ఏముంది నేను వెళ్లి రాత్రి అడుగుతాను అంటుంది అలా అడిగితే రాజ్ కి డౌట్ వస్తుందని శ్వేతమనం మాత్రమే దాని గురించి తెలుసుకోవాలి మా ఆయనకు తెలియకూడదు అని చెప్తుంది కావ్య మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు మీరు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి అక్కడికి వెన్నెలను తీసుకురండి అని అంటుంది కావ్య.ఈ ప్లాన్ చాలా బాగుంది ఇది ఎలాగైనా అమలు చేయాలి అని ఇద్దరు అనుకుంటారు. ఇక వెన్నెల దొరికినట్లేని కావ్య అనుకుంటుంది ఇంటికి వచ్చేసరికి అపర్ణాదేవి ఎదురుగా నిలబడి ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో అపర్ణ కావ్యను ఈ ఇంట్లో నీకు రాజు అన్యాయం చేశాడని తెలిసి కూడా ఎందుకు ఉంటున్నావు ఈ ఆస్తి మీద కన్నేసావా ఈ ఐశ్వర్యం కోసం ఆశపడుతున్నావా లేక పుట్టింట్లో గతిలేకనా అని అడుగుతుంది.రాజ్ కూడా కావ్యతో నువ్వు నా వల్ల బాధపడ్డావు నీ బతుకంతాబాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పుట్టింటికి వెళ్ళిపో కళావతి అని చెప్తాడు దానికి కావ్య సరే అంటుంది.

593 views