Samntha: సమంత – కేటీఆర్ మధ్య ఇంత నడిచిందా? వైరల్ గా మారిన సమంత ట్విట్..

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Samantha Replied Ktr’s Post : సమంత ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత తన ఆరోగ్య సమస్యల వల్ల, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఏ మాత్రం జోరు తగ్గకుండా ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇతర సెలబ్రిటీ ఫొటోస్ కూడా ఎప్పుడు కామెంట్స్ పెడుతూ అందరితో టచ్ లో ఉంటారు సమంత సోషల్ మీడియాలో ఇక ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఒక పోస్టుకు సమంత పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కేటీఆర్ యాక్టివ్ గా ఉంటూ, రాజకీయంగా ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నా కూడా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం విశేషం. అత్యవసరమైన వారి అభ్యర్థులను సైతం సోషల్ మీడియా ద్వారానే రిప్లై ఇస్తూ ఉంటారు తమపై చేసిన ఆరోపణలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు కేటీఆర్. కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ప్రజలకు వారి అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉండడం కేటీఆర్ ప్రత్యేకత.

ఇదిలా ఉంటే ఇప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టుని పెట్టారు చిరునవ్వుతో చిందిస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ, జీవితం మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. కానీ చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని క్యాప్షన్ జత చేశారు. కేటీఆర్ చేసిన పోస్ట్ కి మొదటిగా సమంత స్పందించడం ఇక్కడ విశేషం. కెసిఆర్ పోస్టుకు స్పందిస్తూ సమంత దండం పెట్టే ఏమోజిని షేర్ చేసింది. సమంత స్పందించడం ఇప్పుడు నటించే వైరల్ గా మారింది. అంతేకాకుండా కేటీఆర్ పోస్టుకు శ్యామ్ స్పందించడం పై నిటిజన్లు వారికి నచ్చిన కామెంట్స్ చేస్తూ ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు .

1006 views