karthika Deepam2:దీపని చూసి బెదిరిన పారిజాతం.. శౌర్య తండ్రి గురించి కార్తీక్ అరా.. బంటు మీద దీప అనుమానం..

Posted by uma, April 16, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Karthika Deepam2: కార్తీక్ తో జోష్న పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచనతో శివన్నారాయణ నీ కొడుకుని మేం చేసుకుంటామని చెప్పాము కాబట్టి కచ్చితంగా చేసుకొని తీరుతాము అని అంటాడు. ఇచ్చిన మాట తప్పుతారేమోనని పారిజాతం అంటుంది ఒకసారి మాటిచ్చామంటే తప్పేదే లేదు అని శివన్నారాయణ చెప్తాడు అప్పుడే కార్తీక్ దీపం తీసుకుని ఇంటికి వస్తాడు కార్తీకదీపం కారులో నుంచి దిగడం పారిజాతం చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్ ఇంట్లోకి రావడంతోనే పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ కోపంగా పారిజాతం వైపు చూస్తారు సుమిత్రా మాట్లాడుతూ నువ్విలా ఉన్నావు కానీ మీ అమ్న అయితే పెళ్లికి తెగతొందర పెడుతుంది రా ఇక వచ్చి ముహూర్తం లోనే పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. కార్తీక్ కోపంగా పారు వైపు చూస్తాడు పారు అక్కడి నుంచి తప్పించుకొని పక్కకు వెళుతుంది.

ఇక మరోవైపు పారిజాతం దీప దగ్గరికి వెళ్తుంది నువ్వేమన్నా కారుకి ఓనర్ అనుకుంటున్నావా నా మనవడు ఏమన్నా డ్రైవర్ అనుకుంటున్నావా నువ్వు కారులో ఎక్కి తిప్పడానికి మా వాడు ఎలా కనిపిస్తున్నాడు నీ కంటికి అయినా నువ్వు డోర్ కూడా తీయకపోతే మావాడు తీస్తే గాని బయటికి రావా, అని నోటికి వచ్చినట్లు పారిజాతం దీపతో మాట్లాడుతుంది దీప ఇంతకుముందు కూడా మీరు ఇలానే అపార్థం చేసుకున్నారు డోర్ రాకపోతే ఆయన వచ్చి తీశారు నేను బయటికి వచ్చాను అని అంటుంది. కానీ పారిజాతం అసలు నా మనవడు కారు నువ్వు ఎందుకు ఎక్కావు వస్తుంటే దారిలో కనిపిస్తే ఎక్కావా లేకపోతే నువ్వే ఎక్కావా, సిగ్గుండాలైన గాని ఇలా అది గొప్పింటి పిల్లలకు తిరగాలని ఆశ రావడం అని దీపం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక వెంటనే దీపక్ కోపంగా మీరు అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందు మీరు ఏం జరిగిందో వెళ్లి ఆ మనిషిని అడగండి అని అంటుంది. అయినా తప్పు నా మనవడిదే కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనుకుంటే వాళ్ళ బుద్ధి కరిగిపోతుంది అని అంటుంది ఇక వెంటనే దీప కోపంతో కుదరని కుక్క అని అవమానిస్తుందని అర్థం అయిపోయి పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది.

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడింది నాలుక ఉంది కదా ఇష్టం వచ్చినట్లు తిప్పకండి నేను చెయ్యి తిప్పాల్సి వస్తుంది. నేను తప్పు చేసే మనిషిని కాదు అది మీకు కూడా తెలుసు కానీ నా హద్దుల్లో నాకు ఎట్లా ఉండాలో తెలుసు వేరే వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నేను అబద్ధం దాటను ఎవరైనా దాట్లో అప్లికేషన్ అప్పుడు మాటలు కాదు చేతులతో సమాధానం చెప్తాను. అని దీపానగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఇప్పుడు మనం దీంతో తన్నులు తినడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది దీని కోపం వచ్చినట్టుంది అనుకొని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప మాత్రం మనసులో నేను వదిలేసిన విషయాలు ఈయన జోక్యం చేసుకొని దాని పెద్ద గొడవ తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ మనిషికి నిజం తెలిసింది ఇక్కడితో ఇది ఆగుతుందా లేదంటే ఈ గొడవ పెద్దదవుతుందా అని కంగారు పడుతూ ఉంటుంది.

ఇక మరోవైపు కార్తీక్ సవరి దగ్గరికి వెళ్తాడు నీకు పెద్ద చాకోలెట్ తీసుకొచ్చి ఇస్తాను అని అంటాడు.థాంక్స్ అంటుంది సౌర్యా,నరసింహంతో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు కార్తీక్.శౌర్యకు తన ఫ్యామిలీ విషయాలని అడుగుదామనుకుంటాడు. సౌర్య కార్తీక్ తో మా నాన్న కోసమే మేము హైదరాబాద్ వచ్చామని చెప్తుంది. మరి మీ నాని నువ్వు చూసావా అని అడుగుతాడు ఇంతవరకు చూడలేదు అని చెప్తుంది నాన్న ఇక్కడికి ఎప్పుడు వచ్చాడని కార్తీక్ అడుగుతాడు నాకు తెలియదు అని చెప్తుంది మరి మీ నాన్న ఇక్కడికి రావడానికి ముందు మీతో బాగా ఆడుకునేవాడా అని అడుగుతాడు. అయ్యో కార్తీక్ నీకు మా నాన్న గురించి తెలుసా మా నాన్న నన్ను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడూ మా నాని చూడలేదు అని అంటుంది అదేంటి అని అంటాడు కార్తిక అవును కార్తీక్ మా ఫ్రెండ్స్ మా నాన్న ఎక్కడకి వెళ్లడని అని అడిగాను ఊరు వెళ్ళాడు అని చెప్పింది మా అమ్మ అందుకే మా నాన్న వెతుక్కుంటూ ఏ ఊరు వచ్చాము అని చెప్తుంది. అంటే మీ నాని నువ్వు ఒకసారి కూడా చూడలేదు అని అంటాడు కార్తీక్ అవును కార్తీక్ నేను మా నాన్న ఒకసారి కూడా చూడలేదు నాన్న పేరు ఏంటి అని అంటేనే నాన్న అని చెప్తుంది. ఇక కార్తీక్ మనసులో శౌర్య కనీసం తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదా ఇప్పుడు వాడికి చూడలేదా పేరు కూడా తెలీదంటే అసలు వాడు వీళ్ళ జీవితాన్ని ఏం చేశాడో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు.

ఇది అప్పుడే సౌర్య కార్తీక్ మనిద్దరం ఫ్రెండ్స్ కదా నాకో సాయం చేస్తావా అని అడుగుతుంది. నేను మా అమ్మాయి ఎంత వెతికినా కానీ మా నాన్న దొరకడం లేదు నువ్వు మా నాన్నని వెతికి తీసుకొస్తావా అని అడుగుతుంది దాంతో ప్లీజ్ కార్తీక్ మా నాన్న తీసుకురా అని అంటుంది ఇది నాన్నతోనే ఉండిపోవాలి నేను అని చెప్తుంది దాంతో కార్తీక్ వెతుకుతావా లేదా అని అంటుంది సరే నేను వెతికి తీసుకొస్తాను మీ నాన్న అని మాట ఇస్తాడు కార్తీక్ ను చాలా మంచి వాడివి కార్తీక్ మన అని కూడా నీలాగే ఉంటాడా చెప్పు అని అంటుంది. అప్పుడే దీప అక్కడికి వచ్చి సౌర్య అని గట్టిగా అరుస్తుంది. సౌర్యం తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక కార్తీక్ నావల్ల మీ జీవితాలు ఎంతైనా అన్యాయం జరిగిందని బాధపడ్డాను కానీ ఇప్పుడు అర్థమైంది మీ జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని నాన్న ఇలా ఉంటాడని పాపమనుసులు చాలా మంచిగా ఉంటుంది కనీసం జరిగిన విషయాన్ని, సరే కూడా చెప్పలేని పరిస్థితుల్లో దీపం ఉంది నిజంగానే నువ్వు భర్తని వెతుక్కుంటూ వస్తే వాడు నిన్ను ఎందుకు భయపెడుతున్నాడు ఎందుకు బెదిరిస్తున్నాడు ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది అని కార్తీక్ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక దీపా సౌర్యం తీసుకొని ఇంటికి వచ్చి కార్తీక్ తో ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతుంది అయితే నాన్న గురించి నువ్వు చెప్పు అని అంటుంది దానికి దీపం ఇలాగే ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలి అని ఉంటుంది దానికి కార్తీక్ కూడా నాలాగే ఉన్నాడని ఉంటుంది దాంతో అలా అనకూడదు అని దీపావళికి చెప్తుంది అమ్మఅంటే నీలా ఉంటే మరి నాన్న ఎలా ఉంటాడు అని అడుగుతుంది. దీప కోపంగా మాట్లాడుతుంది నువ్వు మన ఊర్లో ఉన్నప్పుడు చాలా నిదానంగా మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దానికి నన్ను తిడుతున్నావు అని సౌర్యా దీప మీద అలిగి కూర్చుంటుంది ఇక దీప బతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఉంటే కష్టం ఊరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది.

ఇక దీప సుమిత్ర దగ్గరికి వచ్చి నేను ఊరికి వెళ్ళిపోవాలి అని వీళ్ళతో చెప్పేయాలి అని మనసులో అనుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సుమిత్ర దినోత్సవ పుట్టినరోజు వేడుకలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. దీప బాగా వంట చేస్తుంది అన్న విషయం ఇంట్లో అందరికీ తెలుస్తుంది దాంతో దీపని జ్యోత్స్న పుట్టినరోజుకి వంటలు చేయమని అడుగుతారు దీపా నేను ఇకనుంచి వెళ్ళిపోదామని వీళ్ళకి చెబుదామని వస్తే వీళ్ళు ఏమో నన్ను పుట్టిన రోజుకి వంట చేయమని అడుగుతున్నారు సరే నాకోసం ఇంత చేసిన వీళ్ళకి ఒకరోజు భోజనం పెట్టేసి వెళ్దాము అని అనుకుంటుంది మనసులో, సరే వంట చేస్తాను అని ఒప్పుకుంటుంది దీప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు జోష్నా ఇక కార్తీకం తీసుకొని బట్టలు కొనుక్కోడానికి షాపింగ్ కి వెళ్తుంది. అప్పుడే దీప కూడా బయటి నుంచి లోపలికి వస్తూ బంటుని చూస్తుంది బంటు దీపాలని చూసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా వచ్చి నిలబడుతుంది. నాకు నువ్వు ఎందుకు ఇలా తప్పించుకొని తిరుగుతున్నావో అర్థం కావట్లేదు నువ్వు ఏదో తప్పు చేసావా లేదంటే దొంగతనం చేసావా అని అడుగుతుంది. నేనెందుకు దొంగతనం చేస్తాను. నేను పారిజాతం అమ్మగారికి నమ్మినబంటుని అని అంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు ఎందుకు నాకు మొహం కనిపించకుండా తిరుగుతున్నావు అని డౌట్ తో అడుగుతుంది దాంతో బంటు అలాంటిదేం లేదు అని ఈవిడ ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే గుళ్లో నన్ను చూసిన విషయం గుర్తుకు వస్తుందో ఏమో అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు దీప మాత్రం మనసులో ఎక్కడో చూశాను నేను అని ఆలోచిస్తూ ఉంటుంది.ఇక్కడి తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

550 views