Kushbu: హీరోయిన్ కుష్బూ కూతురిని చూసారా..? కురాళ్ళ చూస్తే అసలు రాత్రులు నిద్రపోరు!

Posted by venditeravaartha, May 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Kushbu Daughter : హీరోలతో సమానమైన స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్స్ మన ఇండియా లో చాలా తక్కువమంది ఉన్నారు, ఆ తక్కువమంది లో ఒకరు కుష్బూ. ప్రేమఖైది అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించి, తమిళ హీరోయిన్ గా ఎక్కువ శాతం స్థిరపడింది. తమిళం లో హిట్టు మీద హిట్ కొడుతూ అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ స్టేటస్ కి చేరుకుంది. అక్కడ ఈమెకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆ రోజుల్లో ఈమెని ఒక దేవతలాగా పూజిస్తూ, తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాలు కూడా ఏర్పాటు చేసారు. అక్కడ సూపర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారికి కూడా ఇలా ప్రేక్షకులు దేవాలయాలు కట్టిన దాఖలాలు లేవు. ఆ అదృష్టం కేవలం కుష్బూ కి మాత్రమే తగ్గింది. ఇప్పటికీ ఆమెకి నటిగా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకపక్క నటిగా కొనసాగుతూనే, మరోపక్క రాజకీయ నాయకురాలిగా ఉన్నత శిఖరాలను అధిరోహించింది. బీజేపీ పార్టీ లో ఉన్నత స్థాయి నాయకులుగా పిలవబడే వారిలో ఒకరిగా కుష్బూ పేరుని చెప్పుకోవచ్చు.

మరో నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికలలో ఈమె బీజేపీ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం కూడా చేస్తుంది. అలా అటు సినీ రంగం లోను, ఇటు రాజకీయ రంగంలోనూ దూసుకుపోతున్న కుష్బూ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈమెకి అవంతిక అనే కుమార్తె ఉంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి. చూపులు తిప్పుకోలేని అందం తో నేటి తరం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నటువంటి ఈమె అతి త్వరలోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అట. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Tags :
337 views