Balagam: ‘బలగం’ చిత్రానికి ఆస్కార్ అవార్డుల వర్షం..#RRR ని కూడా డామినేట్ చేసిందిగా!

Posted by venditeravaartha, September 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా బలగం. ఓ పక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా.. ఊళ్లలో పరదాలు కట్టుకుని జనం అంతా ఒక్క దగ్గర కూర్చుని వీక్షించిన సినిమా బలగం. ఈ సినిమా కోసం ప్రజలు థియేటర్ల ముందు కిక్రిరిసిపోయారు. ఈ సినిమా సాధించిన విజమానికి ఇది హిట్ అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది. పిల్లా జల్లా ముసలీ ముతకా ఇలా అందర్నీ బలగం మూవీ ఆకట్టుకుంది. ఉరుకుల పరుగల జీవితంలో కనుమరుగవుతున్న మనిషిలోని భావోద్వేగాలను తట్టి లేపిన సినిమా ఇది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పలు అంతర్జాతీయ అవార్డులు ఈ సినిమాను వరించాయి. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. బలగం మూవీ ఆస్కార్ బరిలో నిలుస్తుందని సమాచారం.

కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరు కూడా సంపాదించింది. బలగం సినిమా విడుదలకు ముందే హర్షిత్, హ‌న్షిత‌లు బ‌ల‌గం సినిమాను పలు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌కు పంపారు. బలగం సినిమాకు ఇప్పటికే 7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. అందులో రెండు అవార్డులు డైరెక్టర్ వేణుకి, ఒక‌టి హీరోకి, మరొకటి హీరోయిన్‌కి మిగిలినవి సినిమాకు వ‌చ్చాయి. అయితే ఈ సంవత్సరం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్​లో అవార్డుల పంట పండించిన సంగతి తెలిసిందే. తర్వాత ఇప్పుడు ఆస్కార్స్ 2024 అధికారిక ఎంట్రీ కోసం మన చిత్రాలు కొన్ని పోటీ పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ షురూ అయింది.

చెన్నై వేదికగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఆస్కార్ కోసం 22 సినిమాలు ఎంట్రీకోసం వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ‘ది స్టోరీ టెల్లర్’ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), ట్వల్త్ ఫెయిల్ (హిందీ), ఘూమర్ (హిందీ), ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, ‘జ్విగాటో’, ‘ది కేరళ స్టోరీ’ , విడుదలై పార్ట్​-1 (తమిళ్), తెలుగు నుంచి ‘దసరా’, ‘బలగం’ రెండు సినిమాలు ఉన్నాయట. అవేకాకుండా ‘వాల్వి’ (మరాఠీ), ‘గదర్ 2’ (హిందీ), ‘అబ్ తో సబ్ భగవాన్ భరోస్’ (హిందీ), ‘బాప్ లాయక్’ (మరాఠీ) తదితర చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిలో మన తెలుగు మూవీ ‘బలగం’ ఆస్కార్ ఎంట్రీ సాధించే పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

250 views