BALAGAM:పెట్టిన బడ్జెట్ కి 14 రెట్లు కలెక్షన్స్ సాధించిన బలగం మూవీ

Posted by venditeravaartha, April 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారు అంటే వారికీ సినిమా నచ్చితే అది చిన్న హీరో సినిమా నా,లేక వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో నా అనేది అసలు పట్టించుకోరు ,ఆ సినిమా ని బ్లాక్ బస్టర్ గా నిలపెడతారు,అందుకు నిదర్శనమే ఈ మధ్య కాలం లో వచ్చిన ‘బలగం’ మూవీ,

కమెడియన్ గా చిన్న చిన్న పాత్రా ల లో నటిస్తూ , జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి,ఆ తర్వాత కొన్ని సినిమా ల కు రచయత కూడా చేసారు,అయితే తనలో గొప్ప రచయత ,డైరెక్టర్ ఉన్నాడు అని గుర్తించిన వేణు ,ఒక చిన్న పల్లెటూరు లో జరిగే న్యాచురల్ విషయాలను బేస్ చేసుకుని గొప్ప ఎమోషన్స్ తో బలగం సినిమా తీశారు, అయితే కేవలం 1 .5 కోట్ల రూపాయల తో తీసి 1 .6 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయినా ఈ చిన్న బడ్జెట్ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది, తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 26.97 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో ప్రియదర్శి , కావ్య కళ్యాణ్‌రామ్ హీరో , హీరోయిన్ ల గా నటించారు . వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
‘బలగం’ మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ :
నైజాం – 18.35 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ – 8.13 కోట్లు
ఆంధ్ర + తెలంగాణ : 26.60 కోట్లు
KA + ROI + OS – 42 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 26.97 కోట్లు

1192 views