Allu Arjun-Surender Reddy: రేసుగుర్రం మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి నో చెప్పిన అల్లు అర్జున్!

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ మరియు కమర్షియల్ సినిమా లు తీసే డైరెక్టర్ ల లో ఒకరు సురేందర్ రెడ్డి(Surender Reddy).2005 లో రిలీజ్ అయినా కళ్యాణ్ రామ్ ‘అతనొక్కడే'(Athanokkade) సినిమా తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు..టాలీవుడ్ లో అడుగు పెట్టి 18 సంవత్సరాలు అవుతున్న అయన తీసింది కేవలం 10 సినిమాలు.. అందులో అతనొక్కడే,కిక్(Kick),రేసుగుర్రం(Race gurram) ,ధ్రువ(Dhruva) వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.అయితే అయన తీసిన సినిమా ల లో చాల వరకు స్టార్ హీరో ల తోనే పని చేసారు సురేందర్ రెడ్డి.ఇక రీసెంట్ గా అఖిల్ తో తీసిన ‘ఏజెంట్'(Agent) సినిమా డిజాస్టర్ కావడం తో సురేందర్ రెడ్డి సినీ కెరీర్ మీద గట్టిగా ప్రభావం పడేలా ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్.

అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా ‘రేసుగుర్రం’ సినిమా కి డైరెక్టర్ అయినా సురేందర్ రెడ్డి గారితో మరో సారి అల్లు అర్జున్ సినిమా చేయనున్నారు అని టాక్ ఉంది,దానికి తగ్గట్లే అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి తమ తదుపరి సినిమా ల జాబితా లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు.కానీ సురేందర్ రెడ్డి గారి చివరి సినిమా లు అయినా సైరా,ఏజెంట్ సినిమా లు ప్లాప్ కావడం అదే సమయానికి అల్లు అర్జున్ గారికి అలా వైకుంఠ పురములో(Ala vaikuntapuramulo) ,పుష్ప(Pushpa) సినిమా లు బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా పాన్ ఇండియా స్థాయి ఆయనకి గుర్తింపు రావడం తో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ల విషయం లో చాల జాగ్రత్త లు తీసుకుంటున్నారు.

మరి ఏజెంట్ లాంటి డిజాస్టర్ తరువాత సురేందర్ రెడ్డి గారితో సినిమా ఉండటంలేదు అనేది అల్లు కాంపౌండ్ నుంచి వస్తున్న వార్త.సురేందర్ రెడ్డి గారు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు చేయకుండా ఏదైనా మీడియం బడ్జెట్ ,టైర్ 2 హీరోల తో సినిమా లు తీసి తనని తాను ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా తనకి అవకాశాలు వస్తాయి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

703 views