Sekhar kammula: ధనుష్ కోసం శేఖర్ కమ్ముల ఆగుతాడా ?

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ ల లో శేఖర్ కమ్ముల(sekhar kammula) గారిది ప్రత్యకమైన స్టైల్..ఇండస్ట్రీ కి వచ్చి 24 సంవత్సరాలు అయినా తాను డైరెక్ట్ చేసింది కేవలం 9 సినిమా లే.1999 లో డాలర్ డ్రీమ్స్ అంటూ వచ్చిన శేఖర్ కమ్ముల కమర్షియల్ గా హిట్ కొట్టకపోయిన నేషనల్ అవార్డు ని పొందారు.ఇక 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆనంద్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నారు తన నిర్మాణ ,దర్శకత్వం లో చేసిన ఆనంద్(Anand) ,హ్యాపీ డేస్ ,లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా లు తనకి మంచి సక్సెస్ తో పాటు గా బోలెడు డబ్బులు ,అవార్డు ల ను తెచ్చి పెట్టాయి.

aanad

దగ్గుబాటి రానా ని పరిచయం చేస్తూ ఆయన చేసిన లీడర్ మూవీ ఇప్పటికి ఒక క్లాసిక్ గా ఉంది అంటే శేఖర్ కమ్ముల గారి కథ లు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది.అలానే సుమంత్ గారికి గోదావరి,వరుణ్ తేజ్ కి ఫిదా లాంటి క్లాసికల్ బ్లాక్ బస్టర్ ల ను ఇచ్చాడు.ఇక 2021 లో చైతన్య కి లవ్ స్టోరీ తో బ్లాక్ బస్టర్ ని ఇచ్చి తన తదుపరి చిత్రం తమిళ సూపర్ స్టార్ ధనుష్ గారి తో ఉంటుంది అని ప్రకటించారు.విలక్షణమైన నటన కలిగిన ధనుష్ గారితో శేఖర్ కమ్ముల గారి సినిమా అనడం తో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

dhanush
ఇటీవల ధనుష్ తెలుగు,తమిళ లో రిలీజ్ చేసిన సార్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తో మంచి జోరు మీద ఉన్నారు.ప్రస్తుతం తాను కెప్టెన్ మిల్లర్ అనే భారీ మాఫియా చిత్రం లోచేస్తున్నారు
దానితో పాటు గా 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పీరియాడిక్ చిత్రం లో నటిస్తున్నారు..ఈ రెండు చిత్రాలను పూర్తి చేశాకే మరో చిత్రాన్ని స్టార్ట్ చేయాలి ధనుష్ అనుకుంటున్నారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన శేఖర్ కమ్ముల ధనుష్ కోసం వేచి ఉంటాడా లేక మరో హీరో తో సినిమా చేస్తాడా అని చూడాలి.

 

1382 views