Mrunal Takur: విజయ్ దేవరకొండ తో సినిమా కి మృణాల్ ఠాకూర్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా?

Posted by venditeravaartha, July 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సీత రామం మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించారు..సీత క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచిన మృణాల్ ఆ తర్వాత కొన్ని హిందీ సినిమా లు ,వెబ్ సిరీస్ లు చేసినప్పటికీ మన తెలుగు లో కొన్ని ఆఫర్ లు మాత్రమే వచ్చాయి అందులో న్యాచురల్ స్టార్ నాని మరియు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియన్ సినిమా ల లో అవకాశం దక్కింది.అయితే మొదటి సినిమా కి ఇప్పుడు తాను చేస్తున్న సినిమా ల కి రెమ్యూనిరేషన్ అనేది చాలానే తేడా ఉంది అంటున్నారు..సాధారణంగా సినిమా సక్సెస్ అయితే వారి రెమ్యూనిరేషన్ పెరగడం అనేది జరుగుతూనే ఉంటుంది.

sitaramam

మృణాల్ ఠాకూర్ తన మొదటి తెలుగు సినిమా కోసం దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం,ఆ సినిమా లో ఆమె కనబరిచిన అద్భుతమైన తన నటన కి ఫిదా అయిపోయారు మన తెలుగు ప్రేక్షకులు.సీతారాం ఆడియో ఫంక్షన్ లో తన అభిమాన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పిన ఈమె ప్రస్తుతం తన తో దిల్ రాజు గారి బ్యానర్ లో కొత్త మూవీ చేస్తున్న విషయం తెలిసిందే,ఇటీవలే ఈ సినిమా కి పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి.ఇక నాని 30 వ సినిమా లోను నటిస్తున్న ఈమె తన రెమ్యూనిరేషన్ ని కోట్లా లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

mrunal nani

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశరామ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండవ సినిమా కావడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ కావడం తో పక్క హిట్ అని తెలుస్తుంది.ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా రష్మిక మందాన నే అనుకోక ఆమె డేట్ లు లేకపోవడం తో మృణాల్ ఠాకూర్ కి ఆ ఛాన్స్ వచ్చింది.మరి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని మరింత గోల్డెన్ గా మార్చుకున్నారు ఈమె.ఈ సినిమా కోసం దాదాపు 3 నుంచి 4 కోట్లా వరకు డిమాండ్ చేసారు .సీతారామం తర్వాత సినిమా కావడం ,దానికి తోడు ఈ మధ్య రిలీజ్ అయినా లస్ట్ స్టోరీస్ 2 లో కూడా తన అందాలతో అలరించడం తో దిల్ రాజు కూడా ఆమె డిమాండ్ కి ఓకే అన్నట్లు తెలుస్తుంది.

mrunal vijay

2220 views