Mahesh babu: మహేష్‌ సినిమా విషయంలో తప్పెవరిది

Posted by venditeravaartha, February 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు టాప్ హీరోలలో ఒకరు. తన ప్రతి సినిమా ఏదో ఒక మంచి మెసేజ్ తో రావటం అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది మహేష్ బాబు సినిమాలు అంటే అభిమానులకు పండగే ఆయన సినిమాలు అన్నీ దాదాపుగా ఫ్యామిలీ తో చూడదగిన సినిమాలే ఉండటం విశేషం. తన యాక్టింగ్, ఫైట్స్, కామెడీతో అదరకొడటరు ఇది ఇలా ఉండగా డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయింది అనవచ్చు. మరల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటేనే అభిమానులకు పండగే అనవచ్చు అయితే వీరిద్దరి కాంబో చిత్రం ను ప్రకటించి చాలా నెలలు అవుతున్న ఇంకా పూర్తి కాలేదని సమాచారం వినిపిస్తుంది.

ప్రస్తుత టాలీవుడ్ కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న సమయానికి పూర్తి కావటం లేదు అందులోనూ త్రివిక్రమ్ సినిమాలకు కొంత సమయం పడుతుంది 12 యేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB28 కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు త్రివిక్రమ్ అరవింద సమేత లో చూపించిన ఫైటింగ్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం లో మహేష్ బాబు లుక్ కూడా మాస్ గా కనిపించటం తో మహేష్ బాబు తో కూడా అటువంటి ఫైట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా తన ప్రతి సినిమాల్లో ఫైట్స్ ను కష్టపడి కాకుండా చాలా ఇష్టంగా చేస్తారట.

అయితే ఈ సినిమా ను ఆగస్ట్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా షూటింగ్ పూర్తి కాకపోవటం మూలంగా ఇంకో సారి డేట్ ను మర్చబోతునట్లు సమాచారం ఇప్పటికే మూడు సార్లు డేట్స్ ను మార్చటం జరిగింది వీరిద్దరి కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఏడాది అయిన వెయిట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వీరి కాంబో చిత్రం ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Tags :
401 views