Vijay-Prabhas: ప్రభాస్ ని మించిపోయిన దళపతి విజయ్! ఒక్క సినిమా కి అన్ని కోట్లా ?

Posted by venditeravaartha, May 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన సౌత్ ఇండియా లో దళపతి విజయ్(Vijay) కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు ,రజినీకాంత్(Rajinikanth) గారి తర్వాత ఆ స్థాయి స్టార్ డాం ,గట్టిగా చెప్పాలి అంటే అంతకు మంచి స్టార్ డాం ప్రస్తుతం విజయ్ సొంతం..ఇటీవల కాలం లో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా 200 కోట్ల పైన కలెక్షన్ సాధిస్తుంది అంటేనే చెప్పొచ్చు అయన రేంజ్ ఎలాంటిదో అని.ఈ సంక్రాంతి రిలీజ్ అయినా వారిసు(Vaarisu) సినిమా తో తెలుగు లో కూడా మంచి కలెక్షన్ లు రాబట్టాడు.ఇక విక్రమ్(Vikram) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కానగరాజ్(Lokesh kanagaraj) డైరెక్షన్ లో రాబోతున్న లియో సినిమా కి 125 కోట్ల పైన రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కి సంబంధినచిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది..17 సంవత్సరాల గ్యాప్ తరవాత త్రిష(Trisha) విజయ్ తో కలిసి చేస్తున్నారు.ఓవైపు లియో(Leo) సినిమా చిత్రీకరణలో పాల్గోంటూనే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు విజయ్. లియో షూటింగ్ లో బిజీ గా ఉంటూనే ఆయన కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.రీసెంట్ గా రిలీజ్ అయినా కస్టడీ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat prabhu) తో విజయ్ సినిమా ఉండబోతుంది అని త్వరలోనే షూటింగ్ ఉండబోతుంది అని వార్తలు వచ్చాయి.

అయితే తమిళ్ ,తెలుగు భాష లో రిలీజ్ అయినా కస్టడీ సినిమా కి మొదట పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్స్ మాత్రం నిరాశ పరిచాయి.వెంకట్ ప్రభు తో రాబోతున్న సినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తో పాటు గా సినిమా ప్రాఫిట్ లో వాటా కూడా తీసుకోనున్నాడు అని న్యూస్.అయితే ఇదే కానీ జరిగితే మన సౌత్ ఇండియా లో ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకున్న ప్రభాస్(Prabhas) ని మించిపోతాడు విజయ్.ప్రాజెక్ట్ కే(Project k)సినిమా కోసం ప్రభాస్ 125 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

1620 views