TOLLYWOOD:టాలీవుడ్ నుంచి రాబోతున్న భారి బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు

Posted by venditeravaartha, March 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2023 తెలుగు సినీ ఇండస్ట్రీ కి మంచి ఆరంభం ఇచ్చింది అనడం లో సందేహమే లేదు ,జనవరి లో రిలీజ్ అయినా బాలకృష్ణ గారి ‘వీరసింహ రెడ్డి ‘,’వాల్తేర్ వీరయ్య ‘ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడమే కాకుండా మంచి వసూళ్లను కూడా రాబట్టాయి,తర్వాత రిలీజ్ అయినా ‘రైటర్ పద్మభూషణ్’,’బుట్ట బొమ్మ ‘,’వినరో భాగ్యము విష్ణు కథ ‘,’సార్’,’దాస్ కా ధమ్కీ ‘,’రంగమార్తాండ’ సినిమా ల తో గడిచిన 3 నెలలో మంచి సక్సెస్ నే చూసాము, అందులో కొన్ని తక్కువ బడ్జెట్ తో సినిమా లు ఉన్నపటికీ మంచి సక్సెస్ సాధించాయి. ఇక రానున్న రోజుల్లో తెలుగు నుంచి భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా లు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి ,అవి ఏంటో చూద్దాం.

ప్రస్తుతానికి తెలుగులో పలు భారీ ప్రాజెక్టులు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మర్చి నెల ఆఖరిలోనే నాని హీరోగా నటించిన దసరా తర్వాతి నెలలో రవితేజ రావణాసుర సినిమా రిలీజ్ అవుతున్నాయి. నాని ‘దసరా ‘ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది ,దాదాపు 80 కోట్ల మేర బడ్జెట్ ఉన్న సినిమా ఇది. ఇప్పటికే నాని ఇండియా మొత్తం తిరుగుతూ పబ్లిసిటీ చేస్తున్నారు,రవితేజ గారి రావణాసుర 50 కోట్ల బడ్జెట్ తో తీశారు. నాని ,రవితేజ సినిమా ల తర్వాత రిలీజ్ కాబోతున్న మరో క్రేజీ ,భారీ బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’ ,గుణశేఖర్ గారు నిర్మాణ ,డైరెక్షన్ లో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమా ,ఇందులో ప్రధాన పాత్రా లో ‘సమంత’ గారు నటించారు, దీని బడ్జెట్ దాదాపు గా 80 కోట్ల రూపాయలు.అంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించండం కష్టమే అయినా హిట్ టాక్ వస్తే మాత్రం ఈజీ గా కలెక్షన్ రాబడుతోంది.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరో గా నటించిన పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’ ,చిత్ర లహరి తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న తేజ్ కి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి ,ఈ సినిమా కి బడ్జెట్ దాదాపు 50 కోట్లు.ఈ సినిమా ద్వారా ‘కార్తీక్ ‘ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.

ఇక ఎంతో కాలం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ , ఏప్రిల్ 28 న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’ తో మన ముందుకి రాబోతున్నారు, ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 80 కోట్ల రూపాయలు.మరి ఏజెంట్ సినిమా తో అయినా అఖిల్ కి బ్రేక్ వస్తుంది ఏమో చూడాలి.మే 12 న మరో పాన్ ఇండియా సినిమా గా యువ హీరో ‘తేజ సజ్జ ‘ నటించిన ‘హనుమాన్ ‘ రిలీజ్ కాబోతోంది ,ఈ సినిమా కి డైరెక్టర్ ‘ప్రశాంత్ వర్మ ‘.

జూన్ 16 వ తేదీన ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా రాబోతోంది. జూలై 28వ తేదీన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . అదే విధంగా జూలై ఆగస్టు నెలలో బోయపాటి డైరెక్షన్లో రామ్ హీరోగా రూపొందుతున్న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఆ తర్వాత ఆగస్టు 11వ తేదీన మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తమిళ సూపర్ హిట్ తెలుగు రీమేక్ సినిమా బోలా శంకర్ విడుదల కాబోతోంది. ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 108 సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 28వ తేదీన ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా రాబోతోంది. ఇక అక్టోబర్ నెలలో పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని రిలీజ్ కావాలి.

కానీ అనేక కారణాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ లో దసరా సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ NBK 108 సినిమా పోటీపడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లోని SSMB 28 కూడా రిలీజ్ అవ్వబోతోంది,రామ్ చరణ్ ,శంకర్ కలయిక లో రాబోతున్న ‘గేమ్ చేంజెర్ ‘ కూడా సంక్రాంతి భరి లో ఉంది ,ప్రభాస్ ,దీపికా పడుకొనే,అమితాబ్ నటించిన ఇండియన్ భారి బడ్జెట్ ఫిలిం గా రాబోతున్న ‘ప్రాజెక్ట్ కే ‘ సంక్రాంతి భరి లో ఉంది.మహేష్ ,రామ్ చరణ్ ,ప్రభాస్ ఈ ముగ్గురి సినిమా ల బడ్జెట్ దాదాపు గా 1000 కోట్ల పైన ఉంది ,మరి ఈ స్థాయి లో కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది చూడాలి.

322 views