Tollywood: టాలీవుడ్ నుండి 1000 కోట్లు కొట్టబోయే హీరోలు వీళ్ళే! ఏంటి ఆ సినిమా లు !

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అప్పట్లో ఒక సినిమా 100 కోట్ల కలెక్షన్ రాబట్టాలి అంటే చాల కష్టం అయ్యేది ,కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ లు ,హీరో ల రెమ్యూనిరేషన్ లు 100 కోట్ల ను మించిపోతున్నాయి.రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా స్థాయి ఆమాంతం తారా స్థాయి కి చేరింది ఆ సినిమా హీరో ప్రభాస్ తన రెమ్యూనిరేషన్ ని 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ఇప్పుడు ఉన్న స్టార్ హీరో ల లో 1000 కోట్ల కలెక్షన్ సాధించే వారి లో ప్రభాస్ ,చరణ్ ,అల్లు అర్జున్ లు ముందు వరస లోఉన్నారు.ఆదిపురుష్ ,సాలార్ ఈ సంవత్సరం రిలీజ్ కానున్న ప్రభాస్ సినిమా లు ఏ మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన 1000 కోట్లు ఈజీ గా రాబడుతాడు ప్రభాస్,అలానే శంకర్ తో వస్తున్న ‘గేమ్ చెంజర్’ సినిమా మీద 1000 కోట్ల టార్గెట్ ఉంది.

ఇక ఇదే టార్గెట్ ని అందుకోవడానికి రెడీ గా ఉన్న వారిలో అల్లు అర్జున్ ఒకరు.పుష్ప సినిమా తో 350 కోట్ల ని కొల్లగొట్టిన పుష్ప ,ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలే ఉన్నాయి ఖచ్చితంగా 1000 కోట్ల రేస్ లో ఉంది పుష్ప 2.రాజమౌళి ,ప్రభాస్ ల 2017 లో రిలీజ్ అయినా బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు పార్ట్ 1 ఎండింగ్ లో ఇచ్చిన ట్విస్ట్ ,బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వలన ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది.

RRR తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు. ఆ తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ ,యాష్ ల ‘కెజిఫ్ చాప్టర్ 2 ‘ RRR ని క్రాస్ చేసి 1200 కోట్ల పైన వసూళ్లను సాధించింది. బాలీవుడ్‌కు అందని ద్రాక్షలా ఉన్న 1000 కోట్ల మార్క్‌ను 2023లో పఠాన్‌తో అందుకుని చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్. ఇప్పడు బాలీవుడ్ నుంచి హ్రితిక్ రోషన్ వార్ 2 ,షారుక్ ఖాన్ జవాన్ సైతం 1000 కోట్ల క్లబ్ కోసం ఉన్నాయి,ఇక మన టాలీవుడ్ నుంచి రాంచరణ్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్ లు సైతం తన స్టార్ డాం ,పాన్ ఇండియా రిలీజ్ ఉండటం తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉండటం తో 1000 కోట్ల ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని టార్గెట్ లు పెట్టుకున్న సినిమా హిట్ అయితేనే ఈ కలెక్షన్ లు సాధ్యం ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చిన మరో ‘రాధే శ్యామ్’,’ఆచార్య’,’లైగర్’ లాంటి డిజాస్టర్ లు చేయడానికి సైతం వెనకాడరు సినీ ప్రేక్షకులు.

2076 views