టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ,చాక్లెట్ బాయ్ గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో ల రేంజ్ కి ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్.క్రియేటివ్ డైరెక్టర్ తేజ మొదటి సినిమా చిత్రం తో తెలుగు సినిమా కి పరిచయం అయినా ఉదయ్ కిరణ్ తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడు.తన రెండవ సినిమా నువ్వు నేను తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.అప్పటి స్టార్ హీరో లు అయినా మహేష్ ఎన్టీఆర్ ,పవన్ కళ్యాణ్ ,రవితేజ ల తో సమానంగా ఉదయ్ కిరణ్ అంతటి ఫాన్స్ ని పొందారు..ఇక అమ్మయిల లో అత్యధిక ఫాలోయింగ్ ని కలిగిన హీరో గా ఉదయ్ కిరణ్(uday kiran) ఉన్నారు.
తన 19 వ సంవత్సరం లోనే చిత్రం(Chitram) మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా సూపర్ హిట్ సినిమా లు చేసి 2003 లో మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కుమర్తి సుస్మిత తో నిచ్చితార్ధం చేసుకున్నారు.అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వీరి వివాహం ఆగిపోయింది..తర్వాత అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ గారికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని దాని వాళ్ళ ఆయన 2014 లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనే వార్తలు వచ్చాయి.ఇప్పటికి కూడా కొంత మంది ఉదయ్ కిరణ్ గారు చనిపోవడానికి కారణం మెగా ఫ్యామిలీ అనే అంటున్నారు.
చిత్రం ,నువ్వు నేను ,మనసంతా నువ్వే ,కలుసుకోవాలని వంటి సూపర్ హిట్ సినిమా ల తో తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉదయ్ కిరణ్ ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారి పెద్ద కుమర్తి సుస్మిత గారు ఇష్టపడ్డారు.ఆమె ఇష్టం ప్రకారం చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ తో పెళ్లి కి ఒప్పుకున్నారు.వారి నిచ్చిత్దార్ధం ని 2003 లో చేసారు.అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరియు ఆయన పర్సనల్ విషయాలు తెలియడం తో వీరి పెళ్లి ని కాన్సల్ చేసారు. కానీ వీరి పెళ్లి కాన్సల్ మెగాస్టార్ చిరంజీవి గారే చేసారు అని అప్పట్లో ఒక రేంజ్ లో విమర్శించారు.
ఇటీవల సుస్మిత(Susmitha) గారు ఒక ఇంటర్వ్యూ లో ఇదే విషయం గురించి మాట్లాడుతూ తన కి ఉదయ్ అంటే చాల ఇష్టం అని నేను అడగానే నాన్న,బాబాయ్ ఒప్పుకున్నారు,అందుకే మాకు అందరి సమక్షం లో నిచ్చితార్ధం కూడా చేసారు.కానీ ఆ తర్వాత కొన్ని సంఘటనల వలన ఈ పెళ్లి ని కాన్సల్ చేసారు.ఇందులో ఎవరి బలవంతం కూడా లేదు.ఉదయ్ కిరణ్ మరియు మా ఫ్యామిలీ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది,కానీ ఆ తర్వాత కేవలం మా ఫ్యామిలీ వలనే తనకి అవకాశాలు తగ్గాయి అనడం కరెక్ట్ కాదు.ఇండస్ట్రీ లో స్వంతంగా పైకి వచ్చిన వారు చిరంజీవి ఆయన వేరే వాళ్ళని పైకి తీసుకుని రావడం కోసం ట్రై చేస్తారు కానీ ఇలా నాశనం చేయడానికి చేయరు అని స్పష్టం చేసారు.