Sunishith: రామ్ చరణ్ భార్య ఉపాసన తో నిజం గానే గోవా ట్రిప్ వెళ్ళాను:సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ అన్ని కూడా నిజాలు అని చెప్పలేము అలా అని అన్ని అబద్దాలు అనుకోవడం కూడా తప్పే అవుతుంది.అయితే చాల వరకు ఫేమస్ అవడం కోసం సోషల్ మీడియా ని వాడుకునే వారు చాల మంది ఉంటారు..అందులోను అస్సలు ఒక్క నిజం కూడా లేకుండా అన్ని ఫేక్ న్యూస్ ల తో ఫేమస్ అయ్యే వారు ఉంటారు,అలాంటి వారిలో ఒకరు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్(Sunishith).కరోనా టైం లో సోషల్ మీడియా లో ఈయన చేసిన హడావిడి అంత ఇంత కాదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని పెద్ద పెద్ద హీరో లు ,డైరెక్టర్ లు ,హీరోయిన్ లు తనని మోసం చేసారు అని.తన ని మొదట సినిమా ల లో తీసుకుని తర్వాత వేరే వాళ్ళ తో తీశారు అని అందువలనే తాను సాక్రిఫైసింగ్ స్టార్ అయ్యాను అని చెప్పుకుని వచ్చారు.

ఇంతటి తో ఆగకుండా హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తో తనకి పెళ్లి అయింది అని తనని వదిలేసి వెళ్ళిపోయింది అని ఆమె మీద చేసిన వ్యాఖ్యలకి లావణ్య రెస్పాండ్ అయ్యి కేసు కూడా ఫైల్ చేసింది.ఈయన చెప్తున్నా ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవడం తో యూట్యూబ్ ఛానెల్స్ అన్ని ఇతన్ని ఇంటర్వ్యూ లు చేసి ఇంకొంచెం ఫేమస్ అయ్యేలా చేసారు.గత కొంత కాలం నుంచి ఇటువంటివి ఫేక్ న్యూస్ లేకుండా కామ్ గా ఉంటూ వచ్చిన సునిశిత్ ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్(Ram charan) ,అయన భార్య ఉపాసన(Upasana) మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.రామ్ చరణ్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అని ఉపాసన తో తన ఆడి కార్ లో ఇద్దరం కలిసి గోవా కి వెళ్లి బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పడం తో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కి ఏం అర్ధం కాలేదు..ఈ విషయం మెగా ఫాన్స్ కి తెలిస్తే మిమ్మల్ని కొడతరు అంటే నేను ఏమి అబద్ధం చెప్పడం లేదు ఉపాసన తో నిజం గానే వెళ్ళాను అలానే చిరంజీవి పెద్ద అమ్మాయి సుస్మిత(Susmitha) తో కలిసి కూడా లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను అని చెప్పారు.

అయితే ఈ ఇంటర్వ్యూ చుసిన తర్వాత రామ్ చరణ్ ఫాన్స్ సునిశిత్ ని తన అపార్ట్మెంట్ లో పట్టుకుని చితకబాదారు..నువ్వు ఫేమస్ కావడానికి మా అన్నయ ,వదిన మీద ఎందుకు రా ఇలా మాట్లాడుతావు అని కొట్టి ఆ తర్వాత సునిశిత్ చేత తాను కావాలనే ఇలా మాట్లాడాను అని
రామ్ చరణ్,ఉపాసన ,సుస్మిత గారి తో నాకు అసలు పరిచయం కూడా లేదు అని..వాళ్ళ మీద ఇలా మాట్లాడితే ఫేమస్ అవుతాం అని అలా మాట్లాడాను నన్ను క్షమించండి అని చెప్పారు. సునిశిత్ ని రామ్ చరణ్ ఫాన్స్ కొట్టి అయన చేత మాట్లాడించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

37697 views