బుల్లి తెర పవర్ స్టార్ గా పిలవబడే సుడిగాలి సుధీర్ ఇండస్ట్రీ లోకి రావడానికి చాల కష్టాలు పడ్డాడు అని అందరికి తెలిసిందే ,మొదట మెజీషియన్ గా తన పని ప్రారంభించిన సుధీర్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతంగా ఫేమస్ అయ్యారు ,జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్ ఢీ,శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ ప్రోగ్రాంస్ చేస్తూ బిజీ గా ఉంటూనే మరో పక్కా హీరో ఫ్రెండ్ గా ,కమెడియన్ గా క్యారెక్టర్ లు చేస్తూ వచ్చిన సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు ,తర్వాత త్రీ మంకీస్ ,కాలింగ్ సహస్ర ,గాలోడు వంటి సినిమా ల లో హీరో గా కనిపించాడు.ఇప్పుడు మరో సినిమా లో హీరో గా నటిస్తున్న సుధీర్ కి జోడిగా సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయినా హాట్ బ్యూటీ ని ఎంపిక చేసారు.
సుడిగాలి సుధీర్ తన 4 వ సినిమా లో హీరోయిన్ గా తమిళ్ అమ్మాయి అయినా దివ్య భారతి ని ఎంపిక చేసారు ,ఈ విషయం ని ధ్రువీకరిస్తూ సినిమా టీం అధికారకముగా ప్రకటించారు. బ్యాచ్లర్ అనే అనువాద చిత్రం ద్వారా పరిచయం అయినా దివ్య భారతి తరచు సోషల్ మీడియా లో కనిపిస్తూ ఉంటారు ,మరి ఈ హాట్ బ్యూటీ నటిస్తుండటం తో సుధీర్ కి భలే ఛాన్స్ తగిలింది అంటున్నారు నెటిజన్లు.మరి దివ్య భారతి ఉండటం తో కొన్ని రొమాంటిక్ సీన్ ల ను సైతం ఈ సినిమా లో కనిపించే ల ఉన్నాయి.ఈ సినిమా ద్వారా అయినా సుధీర్ కి కమర్షియల్ గా పెద్ద హిట్ రావాలి అని అనుకుందాం.