Allu Arjun : అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో నేను సినిమాలు చెయ్యను అంటూ పొగరుగా సమాధానం చెప్పిన హాట్ బ్యూటీ!

Posted by venditeravaartha, September 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తండ్రి ఓ బడా నిర్మాత…మామ మెగా స్టార్ అయినప్పటికీ తన టాలెంట్ తో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత బన్నీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో నటించినందుకు గాను ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. మన దేశంలోనే కాకుండా ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దీంతో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి బడా బడా దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. వారే కాకుండా అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్రలోనైనా కనిపించాలని చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి అల్లు అర్జున్ సినిమాలో చేసేందుకు నో చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అప్పట్లో బన్నీతో సినిమా చేసే అవకాశం తనకు వచ్చిందట. కానీ చేసేది లేదని ఖరాఖండీగా మొఖం మీదే చెప్పేసిందట. ఛీ..ఛీ అలాంటి పాత్రలు చేయనే చేయనంటూ మొండి కేసిందట.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన చిత్రం వేదం. క్రిష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో అనుష్క నటించింది. ఆ పాత్ర సినిమాకే హైలట్ అయింది. కాకపోతే ఆ పాత్రకు ముందుగా నయన్ ను అనుకున్నారట క్రిష్. సినిమా కథనకు నయనతార కి వినిపించారట. కథ నచ్చింది కానీ తన పాత్ర డిజైనింగ్ నచ్చలేదని చెప్పిందట. ఇది నా స్థాయి సినిమా కాదు అంటూ ఛీప్గా ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత క్రిష్.. చాలామంది హీరోయిన్స్ ని సంప్రదించినా ఫలితం లేకపోయిందట. ఆఖరికి అనుష్క సిట్టింగ్ లోనే ఓకే చేసేసిందట. ఆ సినిమాలో అనుష్క చేసిన వేశ్య పాత్ర తనకు ఎంతమంచి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో కొద్దిగా నెగిటివ్ కామెంట్లు వచ్చినా.. నటనపరంగా అనుష్కకి 100శాతం న్యాయం చేసింది. ఈ వార్త ఇంత కాలానికి బయటపడటంతో సినీ ప్రియులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

195 views