టాలీవుడ్ లో ఈ వారం నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాక్కర్లు కొడుతోంది అని చెప్పాలి ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ ఇద్దరు కలిసి ఈ సినిమాని రూపందించారు అయితే మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల మదిలో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా మొదటి 2 పార్టులు హిట్ అయ్యామొదటి రోజు ‘హిట్ 3’ కి హిట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కలెక్షన్స్ బాగున్నాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ నిఒకసారి చుస్తే సహజంగానే ఈ మూడో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి.
నైజాం | 7.73 cr |
సీడెడ్ | 2.38 cr |
ఉత్తరాంధ్ర | 2.46 cr |
ఈస్ట్ | 1.20 cr |
వెస్ట్ | 0.94 cr |
గుంటూరు | 1.39 cr |
కృష్ణా | 1.26 cr |
నెల్లూరు | 0.56 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 17.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.78 cr |
ఓవర్సీస్ | 8.14 cr |
మిగిలిన భాషలు | 0.39 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 29.23 cr |

‘హిట్ 3’ సినిమాకు దాదాపు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా 2 రోజుల్లో ఈ సినిమా రూ.29.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.54.7 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.19.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 2వ రోజు లేదా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ సినిమా హిట్ రేంజ్ లో తన నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి అంతే కాదు రానున్న రోజుల్లో సినిమా కోసం మరింత ఎక్కువ ఆలచనలతో నాని ముందుకు రానున్నారని టాక్.