Hit 3 Movie: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హాయ్ నాన్న’ వంటి వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ మీదున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), ఇప్పుడు ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మే 1 న ఈ చిత్రం తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను మెంటలెక్కిపోయేలా చేసింది. ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలేవీ విడుదలకు దగ్గరగా లేకపోవడంతో ఈ చిత్రం పై ట్రేడ్ భారీ ఆశలు పెట్టుకుంది. విడుదలకు ముందే థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి వంద కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న కొంతమంది ప్రముఖులకు ప్రదర్శించారు.
ఈ ప్రివ్యూ షో నుండి ఎలాంటి టాక్ వచ్చింది?, అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా లేదా? ఎంతసేపు సినిమాలో హింసనే ప్రమోట్ చేసారా?, లేకపోతే అందుకు తగ్గ ఎమోషన్ కూడా ఉంటుందా? అనేది ఇప్పుడు ఈ స్టోరీ లో చూద్దాం. ఈ సినిమా స్టోరీ యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించినవే. ట్రైలర్ లో మనకు డైరెక్టర్ శైలేష్ ఎన్నో క్లూలు వదిలాడు. పాడిబిడ్డల నెత్తురు తాగే క్రూర మృగాలను వేటాడే హీరో లాగ ఇందులో నాని ని చూపించారు. చిన్న బిడ్డపై చెయ్యి వేస్తే మన రక్తం ఎలా అయితే మరుగుతుందో, అలాగే ఈ చిత్రం లో హీరో రక్తం కూడా మరుగుతుంది. వాళ్ళు చేసిన నీచమైన కార్యాలకు ఎంత హింస చేసినా తప్పు లేదు అని అనిపిస్తుంది.
ఆ విధంగా సినిమాని ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడట డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu). ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందని, ఈమధ్య కాలంలో ఇంత సాలిడ్ సినిమా ఎప్పుడూ రాలేదని, కచ్చితంగా ఆడియన్స్ ఆకలి ని తీర్చే సినిమాగా నిలుస్తుందని ఈ సినిమా ప్రివ్యూ షోని చూసిన వారంతా చెప్తున్నారు. అదే రేంజ్ లో పబ్లిక్ కూడా ఫీల్ అయితే, ఈ చిత్రం ఫుల్ రన్ లో వంద కోట్ల.రూపాయిల షేర్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి సినిమా నిజంగా ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది మరో 5 రోజుల్లో తెలియనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలు అవ్వగా, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించే చిత్రం గా నిలుస్తుందని అంటున్నారు.