SHAKUNTALAM:శాకుంతలం మూవీ రివ్యూ : చేతులు కాల్చుకున్న గుణశేఖర్

Posted by venditeravaartha, April 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

గుణశేఖర్ ఎంతో కాలం నుంచి తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్తూ నా సినిమా ‘శాకుంతలం’ ,అగ్ర నటి సమంత ప్రధాన పాత్రా లో కనిపించిన ఈ సినిమా 14 ఏప్రిల్ న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ అయింది,గుణ క్రియేటివ్ వర్క్స్ ,దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్ షో ల తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

శాకుంత‌లం క‌థ‌, అంద‌రికీ తెలిసిందే. మ‌ళ్లీ మ‌రోసారి చెప్పుకొంటే – విశ్వామిత్రుడి త‌పస్సు భంగం క‌లిగించ‌డానికి స్వ‌ర్గం నుంచి మేన‌క భువిపైకి వ‌స్తుంది. మేన‌క‌ని చూసిన విశ్వామిత్రుడు వ‌శం త‌ప్పుతాడు. విశ్వామిత్రుడు, మేన‌క ఒక్క‌ట‌వుతారు. ప్ర‌తిఫ‌లంగా ఓ బిడ్డ జ‌న్మిస్తుంది. న‌రుల‌కు స్వ‌ర్గ లోక ప్ర‌వేశం లేదు కాబ‌ట్టి,ఆ బిడ్డ‌ని భూమ్మీదే వ‌దిలేసి స్వ‌ర్గానినికి వెళ్లిపోతుంది మేన‌క‌. అలా వ‌దిలేసిన బిడ్డ‌,క‌న్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో శ‌కుంత‌ల పేరుతో పెరిగి పెద్ద‌ద‌వుతుంది. ఓరోజు హ‌స్తిన పురి రారాజు దుష్యంతుడు (దేవ్ మోహ‌న్‌) క‌న్వాశ్ర‌మానికి వ‌స్తాడు. అక్క‌డ శ‌కుంత‌ల‌ని చూసి ప్రేమిస్తాడు. త‌న‌ని గాంధ‌ర్వ వివాహం చేసుకొంటాడు. శారీర‌కంగానూ ఒక్క‌ట‌వుతారు. ఓ ఉంగ‌రం గుర్తుగా ఇచ్చి, త్వ‌ర‌లోనే తాను మేళ‌తాళాల‌తో వ‌చ్చి, తీసుకెళ్తాన‌ని శ‌కుంత‌ల‌కు మాట ఇస్తాడు. శ‌కుంత‌ల గ‌ర్భ‌వ‌తి అవుతుంది. ఎంత‌కీ రాని,దుష్యంతుడ్ని వెదుక్కొంటూ హ‌స్తిన‌కు వెళ్తుంది. కానీ.. శ‌కుంత‌ల‌ని దుష్యంతుడు గుర్తు ప‌ట్ట‌డు. ఎవ‌రు నువ్వు? అని నిల‌దీస్తాడు. ఆ అవ‌మాన భారం భ‌రించ‌లేక‌,హిమాల‌యాల‌కు వెళ్లిపోతుంది శ‌కుంత‌ల‌. అక్క‌డే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది. తాను చేసిన త‌ప్పు తెలుసుకొన్న దుష్యంతుడు,శ‌కుంత‌ల‌ని క‌లిసి, క్ష‌మాప‌ణ‌లు అడ‌గ‌డంతో క‌థ ముగుస్తుంది.

శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌డం వ‌ల్ల‌,ఈ సినిమాకి స్టార్ డ‌మ్ వ‌చ్చింది. ఆ పాత్ర‌లో స‌మంత ఇమిడిపోయింది కూడా. కాక‌పోతే,శ‌కుంత‌ల పాత్ర‌ని ఇంకాస్త బాగా డిజైన్ చేయాల్సింది. త‌న‌ని కావాల‌ని బంధీని చేశారేమో అనిపిస్తుంది. చాలా చోట్ల స‌మంత ఓపెన్ అవ్వ‌లేదు. దాదాపు ఒకే ర‌క‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది. దేవ్ మోహ‌న్ చూడ్డానికి బాగున్నాడు. కానీ,ఎక్స్‌ప్రెష‌న్స్ లేవు. దుష్యంతుడికి కావ‌ల్సిన‌దానికంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అలాంట‌ప్పుడు తెలుగు తెర‌కు ప‌రిచ‌మైన న‌టుడ్ని తీసుకోవాల్సింది. మోహ‌న్ బాబు క‌నిపించింది ఒక్క స‌న్నివేశంలోనే. కాక‌పోతే.. మోహ‌న్ బాబు వ‌ల్ల‌,ఆ సీన్ కాస్త పండింది. గౌత‌మి, మ‌ధుబాల చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించారు.

ప్లస్ :సమంత
మైనస్ :ఒక్క సమంత తప్ప సినిమా అంత నెగటివ్ గానే ఉంది.
రేటింగ్ :1 .5 / 5
ఫైనల్ గా గుణశేఖర్ ఇక ఇలాంటి సినిమా లు మానేసి కమర్షియల్ తీసుకోవడం మంచిది.

1349 views