ShahRukhKhn:1000 కోట్ల క్లబ్ లో చేరిన పఠాన్ మూవీ .. ఆనందం లో ఖరీదు అయినా రోల్స్-రోయ్స్ కార్ కొన్న షారుఖ్ ఖాన్

Posted by venditeravaartha, March 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సినిమా కి ముందు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా అనే అనుకునే వారు అంత ,కానీ 2015 బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు సౌత్ ఇండియన్ సినిమా లు కూడా ఇండియన్ సినిమా గా చెప్పుకునే స్థాయి కి వచ్చాం,దానికి కారణం లేకపోలేదు బాలీవుడ్ లో ఖాన్ త్రయం గా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ,అమిర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ లు సరైన హిట్లు ఇవ్వలేకపోవడం దానికి తోడు సౌత్ సినిమా లు అయినా బాహుబలి ,కెజిఫ్ ,పుష్ప ,ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా లు హిందీ లో మంచి కలెక్షన్ సాధించి బాలీవుడ్ సినిమా లని వెనక్కి నెట్టాయి.

బాలీవుడ్ లో ఉన్నటువంటి కాస్టింగ్ కోచ్ ,నేపోటిజం వలన కొంతమంది టాలెంట్ ఉన్న వారు కూడా సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు,కరోనా సమయం లో సూసైడ్ చేసుకున్న ‘సుశాంత్ సింగ్ రాజపుత్ ‘ గారి మరణం తో బాలీవుడ్ మీద తీవ్ర మైన నెగటివిటీ వచ్చింది ,బ్యాన్ బాలీవుడ్ సినిమా అనే స్థాయి కి వచ్చింది , అయితే ఇదే సమయం లో బాలీవుడ్‌ పనైపోయింది అని విరగబడి నవ్వినవాళ్లకు పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్‌ ఖాన్‌. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన షారుక్‌ ముప్పైకి పైగా రికార్డులను బద్ధలు కొట్టాడు. పఠాన్‌ రిలీజై 50 రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1049.50 కోట్ల గ్రాస్‌ రాబట్టిందీ చిత్రం. ఇందులో ఇండియా వాటా రూ.657.25 కోట్లు కాగా ఓవర్సీస్‌ది రూ.392.35 కోట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన షారుక్‌ తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసిశాడు. రోల్స్‌ రాయిస్‌ క్యులినన్‌ బ్లాక్‌ బెడ్జ్‌.. ఎస్‌యూవీ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని అంచనా! భారత్‌లో అమ్ముడవుతున్న ఖరీదైన ఎస్‌యూవీ కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం షారుక్‌ తన కొత్త కారులో షికారుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత నెలలో రూ.5 కోట్లు విలువ చేసే వాచీ చేతికి ధరించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడీ బాలీవుడ్‌ స్టార్‌.ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌.. అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’, రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో ‘డుంకీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

524 views