Sandeep reddy vangaa: ప్రభాస్ తర్వాతే చిరంజీవి అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా!

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు రాష్ట్రాల తో పాటు యావత్ ఇండియా అంతటా మారు మోగిన పేరు సందీప్ రెడ్డి వంగా ,విజయ్ దేవరకొండ హీరోగా ,షాలిని పాండే హీరోయిన్ గా 2017 లో రిలీజ్ అయినా అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయింది,విజయ్ దేవరకొండ కెరీర్ ని డిసైడ్ చేసిన సినిమా ఇది.తెలుగు లో బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా ని తమిళ్ ,మలయాళ ల భాష ల లో రీమేక్ చేయగా హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సినిమా ని సందీప్ రెడ్డి ఏ డైరెక్ట్ చేసాడు.

2017 లో తెలుగు లో అర్జున్ రెడ్డి ,2019 లో కబీర్ సింగ్ లని డైరెక్ట్ చేసి రెండు భాష ల లోను బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న సందీప్ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ అయినా రణబీర్ కపూర్ తో అనిమల్ అనే సినిమా ని తీస్తున్నారు,ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 11 నా రిలీజ్ కి రెడీ గా ఉంది.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ఉండబోతుంది ఇప్పటికే మారుతీ ఫిలిం ,ప్రాజెక్ట్ కే ,సాలార్ లాంటి పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ప్రభాస్ సందీప్ సినిమా ని 2024 లో స్టార్ట్ చేయనున్నారు ,మరి ఈ లోపు సందీప్ మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.

ప్రభాస్ తో సినిమా కి ముందు సందీప్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి ,ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు చిరు , ఆ తర్వాత బంగారాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా తో పాటు బింబిసారా డైరెక్టర్ తో మరో సినిమా ఉంటుంది అని న్యూస్ ఉంది.ఈ సినిమా ల మధ్య లో సందీప్ తో సినిమా అనేది ఫేక్ న్యూస్ .అయితే ఇది వరకు సందీప్ చిరంజీవి గారికి ఒక మంచి మాస్ మసాలా స్టోరీ చెప్పారు అని దానికి చిరు ఒకే కూడా చెప్పారు త్వరలోనే షూటింగ్ అని కొన్ని వార్తలు వచ్చాయి అయితే అవి అన్ని కూడా పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది.అనిమల్ సినిమా తర్వాత ప్రభాస్ తోనే సినిమా చేయబోతున్నారు సందీప్.

688 views