Rangabali: రంగబలి మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, July 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

చందమామ కథలు సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయ్యి , ఊహలు గుసగుసలాడే తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హీరో నాగశౌర్య ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా రంగబలి తో మన ముందుకు రాబోతున్నారు.నూతన దర్శకుడు పవన్ డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి గారు ప్రొడ్యూసర్ గా బ్రహ్మాజీ ,సత్య ప్రధాన పాత్రలు గా రంగబలి జులై 7 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది.చలో సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్నా నాగశౌర్య ఈ సినిమా తో అయినా బ్లాక్ బస్టర్ సాధించాడా లేదా ? అని చూద్దాం.

rangabali movie

కథ:నాని(నాగశౌర్య) ఎటువంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ తన ఊరు లో నివసిస్తూ ఉంటారు,అయితే అతని స్నేహితుడు కమెడియన్ సత్య తో కలిసి ఎంజాయ్ చేస్తున్న నాని కి డాక్టర్ సహజ(యుక్తి థేరేజా) పరిచయం అవుతుంది.పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది,అయితే కొన్ని పరిణామాల మధ్య సహజ వైజాగ్ వెల్తుంది,తన ప్రేమ ని ఎలా అయినా గెలిపించుకోవాలి అని నాని కూడా తన ఊరిని వదిలి వైజాగ్ కి వెళ్తారు,అక్కడ సహజ వాళ్ళ నాన్న ని తన పెళ్లి కి ఎలా ఒప్పించాడు,అక్కడ తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది మిగిలిన కథ.

nagashourya
విశ్లేషణ:రంగబలి సినిమా మొదటి భాగం లో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది ..ఫస్ట్ హాఫ్ లో నాని ,సహజ ల మధ్య వచ్చే లవ్ సీన్ లు ,సత్య కామెడీ ల తో నడిపించిన డైరెక్టర్ అసలు కథ ని సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసాడు,తన ప్రేమ ని గెలిపించుకోవడం కోసం రంగబలి నుంచి వైజాగ్ వెళ్లిన నాని అక్కడ ఏమి చేసాడు అనేది కొంచెం సినిమాటిక్ గా అనిపించినా కొన్ని సీన్ ల లో బోర్ కొట్టినప్పటికీ సేఫ్ గానే అనిపిస్తుంది.ఇక జానీ లోని సాంగ్ తప్ప మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు.రంగబలి ఒక సాంఘిక నాటకం మొదటి భాగం తో ఓ రేంజ్ లో అలరించిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ గా అనిపిస్తుంది.
పాజిటివ్:కథ,స్క్రీన్ ప్లే ,నాగశౌర్య ,సత్య కామెడీ ,ఫస్ట్ హాఫ్.
నెగటివ్:సెకండ్ హాఫ్ ,క్లైమాక్స్
రేటింగ్:3 / 5
చివరగా చెప్పాలి అంటే చలో సినిమా తర్వాత నాగశౌర్య కి మంచి కమర్షియల్ హిట్ దక్కింది.

3162 views