RAMCHARAN:రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా, ఒక రేంజ్ లో రీ రిలీజ్ కాబోతున్న మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘ఆరంజ్ ‘

Posted by venditeravaartha, March 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

RRR సినిమా తో గ్లోబల్ స్థాయి లో గుర్తింపు తెచ్చుకుని హాలీవుడ్ మూవీ లో సైతం నటించే ఛాన్స్ లు కొట్టేసిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ , మార్చి 27న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా చరణ్‌ బర్త్‌డే కానుకగా ఆరెంజ్‌ సినిమా ను రీ రిలీజ్‌ను చేయనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ గారి కెరీర్‌లో ఎన్నో హిట్లు, సూపర్‌ హిట్లు ఉండచ్చు. అయితే అతని కెరీర్‌లో ఆరెంజ్‌ సినిమాకు ప్రత్యేక స్థానముంటుంది. సాధారణంగా హిట్‌ అయిన సినిమాలు ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే డిజాస్టర్‌ అయిన మూవీస్‌కు కూడా ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉంటారనేందుకు ఆరెంజ్‌ మూవీ ప్రత్యక్ష ఉదాహరణ. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.

మగధీర తర్వాత భారీ అంచనాలతో 2010లో విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ప్రేమకథా చిత్రాల్లో ఓ సరికొత్త కణాన్ని ఆవిష్కరిస్తూ ఆరెంజ్‌ను తెరకెక్కించారు. ఇందులోని అన్ని సాంగ్స్ ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. ఇక రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించారు . అప్పటి యువత కి ఈ సినిమా లో ఉన్న మెయిన్ పాయింట్ కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే థియేటర్ లో డిసాస్టర్ మిగిలిన ఈ సినిమా బుల్లితెర, యూట్యూబ్‌లలో మాత్రం అదరగొట్టింది. టీవీలో ఈ సినిమా వస్తే ఇప్పటికీ కళ్లప్పగించుకుని మరీ చూస్తుంటారు. అంతేకాదు ఆరెంజ్‌ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయితే కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిపోయేది అని అంటారు . అప్పుడు మిస్ అయ్యి టీవీ ,మొబైల్ ,కంప్యూటర్ ల లో చుసిన వారికీ మరో అవకాశం కల్పించనున్నారు.

ఇప్పటి వరకు అందరు రాంచరణ్ పుట్టిన రోజున ఇండస్ట్రీ హిట్ అయినా ‘మగధీర’ ని రీ రిలీజ్ చేయాలి అనుకున్నారు ,కొన్ని సాంకేతిక కారణాల వలన మగధీర 4k ప్రింట్స్ రెడీ అవ్వకపోవడం తో మ్యూజికల్ క్లాసిక్ గా నిలిచినా ‘ఆరంజ్ ‘ సినిమా ను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నారు. మరి రాంచరణ్ రీ రిలీజ్ రికార్డ్స్ లో మొదటి స్థానం లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ‘ఖుషి’ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తారో లేదో చూడాలి.ఈ సినిమా రిలీజ్‌ ద్వారా వచ్చే కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్మాత, మెగా బ్రదర్‌ నాగబాబు ఆలోచిస్తున్నారట. మరి యూత్‌ను బాగా మెప్పించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఈసారైనా థియేటర్లలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

537 views