NTR Hollywood:హాలీవుడ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్

Posted by venditeravaartha, April 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచవ్యాప్తం గా తన నటన తెలుసు తన నటనలో కానీ డాన్స్ లో కానీ ఎటువంటి లోపాలను ఎత్తి చూపలేము అంతటి స్టార్ హీరో ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ వార్తపై పూర్తి సమాచారం మనకు తెలుసు వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన డైరెక్షన్ చేసిన చిత్రం బ్రహ్మహస్ర ఇటీవల విజయాన్ని సొంతం చేసుకున్న మాట మనకు తెలిసిందే అయితే ఈ సినిమా కూడా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో రావడం పై భారీ అంచనాలే పెరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గారు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం జేమ్స్ గన్ ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ నటన చూసిన తరువాత తనతో కలిసి సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందని తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు దానితో ఎన్టీఆర్ టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే చెప్పాలి ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ 30 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులు ఈ మధ్య టాలీవుడ్ సినిమాల కు రావడం మనం చూస్తూనే ఉన్నాం సినిమాలో సంజయ్ దత్తు రావడం ప్రభాస్ ఆది పురుషుల్లో సైఫ్ అలీ ఖాన్ రావడం అలాగే ఎన్టీఆర్ 30 చిత్రంలో కూడా సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారట ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తున్నారు ఇంకా కొంత మంది ప్రముఖులు ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి

అయితే ఈ చిత్రం డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్ ను మిస్ అయ్యాం అనే భావన ప్రేక్షకులలో కలిగిందట ఎన్టీఆర్ 30 చిత్రంతో ఆ లోటు తీరబోతున్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ గారి ఆర్ ఆర్ ఆర్ చిత్రం తరువాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకులకు మరియు చిత్ర బృందానికి. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల కానుంది.

475 views