BRO Movie: బెనిఫిట్ షో ,టికెట్ ల విషయం లో జగన్ సహాయం అవసరం లేదు : బ్రో మూవీ నిర్మాతలు.

Posted by venditeravaartha, July 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మొదలు పెట్టిన వారాహి యాత్ర ని మరి కొంచెం స్ట్రాంగ్ గా ప్రజల మధ్య కి తీసుకుని వెళ్లే విధముగా తన రాబోయే మీటింగ్ ల ను ప్లాన్ చేస్తున్నారు.ఇక జులై 27 న నుంచి వారాహి విజయ యాత్ర మూడవ యాత్ర పాలకొల్లు నుంచి మొదలు కానుంది.ఇలాంటి సమయం లో ఆయన ఇది వరకే కమిట్ అయినా సినిమా ల మీద కాస్త గందరగోళం నెలకొంది అని చెప్పాలి.ఇప్పటికే హరీష్ శంకర్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ని ప్రస్తుతానికి ఆపేసిన విషయం కూడా తెలిసిందే.ఇక జులై 28 న రిలీజ్ కానున్న బ్రో సినిమా మీద ఒక టాక్ బయట హల్చల్ చేస్తుంది.

bro

తమిళ నటుడు ,డైరెక్టర్ అయినా సముద్రఖని గారు డైరెక్షన్ చేస్తున్న బ్రో సినిమా ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానేర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసారు.పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించారు.ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్
ట్రైలర్ ల తో విపరీతమైన హైప్ ని తీసుకుని వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచాలనే ఉన్నాయి.దాదాపు 80 కోట్ల బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల మేర ఉంది.అయితే పెద్ద హీరో ల సినిమా ల కి బెనిఫిట్ షో లు ,టికెట్ ల ను పెంచుకోవడం అనేది ప్రతి సినిమా కి ఉంటుంది.

bro

కానీ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్,బీమ్లా నాయక్ సినిమా ల కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల ను తగ్గించి 5 రూపాయలకి టికెట్ లు అమ్మిన సంగతి తెలిసిన విషయమే.పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైం కి ఆంధ్ర ప్రజలు ఒక్క సరిగా పేద వాళ్ళు అవుతున్నారు అని ప్రభుత్వ పెద్దలు అనుకుని టికెట్ రేట్లు తగ్గిస్తున్నారు.ఇక అందుకే రానున్న బ్రో సినిమా విషయం లో సినిమా నిర్మాతలు పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు బ్రో సినిమా ని సరైన బడ్జెట్ లోనే చేసాము ,మేము అనుకున్న విధం గానే బిజినెస్ కూడా చేసుకున్నాం,ఇప్పుడు ఉన్న రేట్లు ,ఉన్న షో ల తోనే సినిమా ని రిలీజ్ చేస్తాము.పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఈ సినిమా తో మరొకసారి చూడబోతున్నం అన్నారు.టికెట్ రేట్ల విషయం లో జగన్ ప్రభుత్వం ని సహాయం కోరడం లేదు అని స్పష్టం చేసారు.

sdt and pk

1848 views