NBK: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో బాలయ్య 109 వ సినిమా.

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ టాప్ హీరో ల లో ఒకరు అయినా నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna) గారు ఇప్పుడు మంచి సక్సెస్ లో ఉన్నారు..అయన కి సింహ ,లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన బోయపాటి శీను(Boyapati seenu) తో చేసిన అఖండ సూపర్ బ్లాక్ బస్టర్ కావడం,సంక్రాంతి కి రిలీజ్ అయినా వీర సింహ రెడ్డి సూపర్ హిట్ అయింది.ఆరు పదుల వయసు లో కూడా ప్రతి సంవత్సరం రెండు సినిమా ల కి తగ్గకుండా తన సినిమా ల ను రిలీజ్ చేసి ఫాన్స్ అందరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా తన నిర్మాతలకి కాసుల పంట పండిస్తున్నారు బాలయ్య.ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ NBK108 నటిస్తున్న బాలయ్య బాబు తన తదుపరి చిత్రాలను కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే ఇద్దరు టాప్ డైరెక్టర్ లు బాలయ్య తో సినిమా లు చేయడానికి రెడీ గా ఉన్నారు.అందులో ఒక సినిమా ని దిల్ రాజు మరొక సినిమా ని మైత్రి వారు తీయనున్నారు.

ఈ సంవత్సరం ఆరంభం లో ‘వీర సింహ రెడ్డి'(Veera simha reddy) తో సూపర్ హిట్ సాధించిన బాలయ్య బాబు దసరా కి NBK108 తో రానున్నారు.అయితే తన నెక్స్ట్ సినిమా కోసం బోయపాటి శీను మంచి మాస్ కథ తో రెడీ గా ఉన్నారు అని త్వరలో ఈ సినిమా కి పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి అనే వార్తలు ఉన్నాయి..ఇక బోయపాటి సినిమా తర్వాత చేయబోయే సినిమా కి సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘వాల్తేర్ వీరయ్య'(Walter veeraih) మూవీ డైరెక్టర్ ‘బాబీ'(Bobby) ని దిల్ రాజు(Dil raju) బాలయ్య గారి సినిమా కి సెలెక్ట్ చేసినట్లు సమాచారం.అయితే బాలయ్య కి ముందు గా రజినీకాంత్ తో బాబీ సినిమా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి..కానీ ఆ సినిమా కి ఇంకా టైం ఉండటం తో ఈ లోపు దిల్ రాజు బాలయ్య తో సినిమా ని స్టార్ట్ చేయనున్నారు.

13116 views