Mr. Pregnet: మిస్టర్ ప్రెగ్నెట్ మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, August 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

యూట్యూబ్ ,బిగ్ బాస్ ల తో ఫేమస్ అయినా సోహెల్ ప్రధాన పాత్రా లో విభిన్నమైన కథ తో రానున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెట్ ,శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయ్యద్ సోహెల్ తో పాటు రూప కొడువాయూర్, సుహాసిని మణిరత్నం మరియు అలీ ,బ్రహ్మాజీ రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.అక్కినేని నాగార్జున గారు ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి ఆదరణ లభించడం తో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.దానికి తోడు ఈ వారం రిలీజ్ కానున్న సినిమా ల లో ఎంతో కొంత హైప్ ఉన్నదీ
మిస్టర్ ప్రెగ్నెట్ కి మాత్రమే.మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం.

sohel

కథ:గౌతమ్ (సోహెల్ ) చాల క్రేజీ గా బ్రతికే ఒక అల్లరి కుర్రాడు తనకి మహిని అనే అమ్మాయి తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారి పెళ్లి చేసుకుంటారు,అయితే తనకి ఉన్న క్రేజీ కి తనకి పుట్టబోయే బిడ్డ కి తానే జన్మని ఇవ్వాలి అనుకుంటాడు,అయితే దానికి కొన్ని అడ్డంకులు
ఉంటాయి అని తెలిసినప్పటికీ తాను ఒప్పుకుని ప్రెగ్నట్ గా మారుతాడు.అయితే గౌతమ్ తన
ప్రెగెన్సీ సమయం లో ఎదురైన సంఘటనలు ఏంటి ,తాను అనుకున్న విధంగా బిడ్డ కి జన్మ ని ఇచ్చాడా లేదా అనేది మిగిలిన కథ.

sohel in pregnet

విశ్లేషణ:లక్కీ లక్ష్మణ్ ,ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు లాంటి సినిమా ల తో పర్లేదు అని తన కామెడీ తో అందరిని అలరించిన సోహెల్ మిస్టర్ ప్రెగ్నట్ మూవీ తో తన లోని మరో కోణాన్ని
మన ముందుకు తీసుకుని వచ్చారు,మొదట కామెడీ తో అలరించిన సోహెల్ సెకండ్ హాఫ్ లో తన లో ఎమోషనల్ తో సినిమా ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లారు.సమాజం లో ప్రెగెన్సీ టైం లో ఆడవారికి ఉండే సమస్యల ని చాల అద్భుతంగా చూపించారు.ఒక పక్క క్రేజీ అంటూ మరో వైపు రియల్ లైఫ్ లో ఆడవారి సమస్యలని చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి
ఒక క్రేజీ కథ కి అద్భుతమైన నటి నటులు కలిస్తే ఆ కథ ఎంత అద్భుతగా ఉంటుందో ఈ సినిమా మరొక సారి నిరూపించింది.సీనియర్ నటులు సుహాసిని గారు బ్రహ్మాజీ ,అలీ గారు తమ పాత్రా లో సినిమా కి న్యాయం చేసారు.
పాజిటివ్:కథ ,కామెడీ ,ఎమోషన్ ,క్లైమాక్స్,నటి నటులు.
నెగటివ్:స్క్రీన్ ప్లే ,సెకండ్ హాఫ్.
రేటింగ్:3 .25 / 5

880 views