సీనియర్ నటుడు నరేష్(Naresh),పవిత్ర(Pavithra) జంట కలిసి నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి.ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్ అయినా ఎం.ఎస్.రాజు గారు ఈ సినిమా కి డైరెక్టర్ గా వ్యవహరించారు.తన జీవితం లో జరిగిన యదార్ధ సంఘటనలని సినిమా గా తీసుకుని వచ్చారు నరేష్.ఈ చిత్రం లో తన మీద నెగటివ్ ముద్ర వేశారు అందుకే సినిమా రిలీజ్ ని ఆపాలి అని నరేష్ మూడవ భార్య అయినా రమ్య రఘుపతి కోర్ట్ ని ఆశ్రయించిన వేళా..ఇన్ని వివాదాల మధ్య ఈ రోజు మళ్ళీ పెళ్లి థియేటర్స్ లో కి వచ్చింది.మరి సీనియర్ హీరో నరేష్ ఈ సినిమా ద్వారా సక్సెస్ అయ్యారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ:నరేంద్ర(నరేష్) ఒక పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రముఖ నటుడు సినిమా ల లో సక్సెస్ అవుతూ వస్తున్న నరేంద్ర కి తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడుదుడుకులు ఎదురు అవుతూ ఉంటాయి.ఆ సమయం లో తన సహా నటి అయినా పార్వతి(పవిత్ర) తో పరిచయం ఏర్పడుతుంది.ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది.ఇక నరేంద్ర కి అప్పటికే మూడు పెళ్లి లు అయి తన మూడవ భార్య అయినా రమ్య రఘుపతి తో విడిపోయి ఒంటరిగా ఉంటారు.
పార్వతి కి కూడా అప్పటికే వివాహం అయి ఉంటుంది తన భర్త తో తరుచు గొడవలు పడుతూ జీవిస్తూ ఉంటుంది.మరి ఇలా ఉన్న తమ ఇద్దరు ఎలా ఒక్కటి అయ్యారు,తాము ఎదురుకున్న ప్రాబ్లమ్స్ ఏ మిగిలిన కథ.
విశ్లేషణ:సినీ పరిశ్రమలో 50 ఏళ్లు జరుపుకుంటున్న నటుడు మరియు నిర్మాత అయినా నరేష్ గారికి ఈ చిత్రం చాల ప్రత్యకమైంది అని చాల సార్లు ఆయన చెప్పారు.తానే నిర్మాత ,రైటర్ గా
అయినా ఈ సినిమా లో సీనియర్ నటులు అయినా శరత్ బాబు,జయప్రద,అన్నపూర్ణమ్మ గార్లు
ముఖ్య పాత్రలను పోషించారు.నరేష్, అతని నుండి విడిపోయిన మూడవ భార్య రమ్య రఘుపతి మరియు ఇప్పుడు లైవ్ ఇన్ పార్ట్‌నర్ పవిత్ర లోకేష్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
పాజిటివ్:నరేష్ ,పవిత్ర ల నటన,మ్యూజిక్.
నెగటివ్:కథ,స్క్రీన్ ప్లే ,కొన్ని బోరింగ్ సీన్ లు.
రేటింగ్:2 .5 / 5
చివరిగా నరేష్ ,పవిత్ర ల పవిత్ర ప్రేమ కథ గా మళ్ళీ పెళ్లి.