Kavya maran: సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో ప్రస్తుతం ఉన్న పది టీం ల లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ది ప్రత్యేకమైన శైలి..హైదరాబాద్ టీం లో ఒకప్పుడు ఉన్న ప్లేయర్స్ ఎవరు కూడా టీం లో ఇప్పుడు లేరు,ముఖ్యముగా డేవిడ్ వార్నర్,కేన్ విలిమ్సన్ లు టీం విజయాల లో ప్రధాన భూమిక పోషించిన వారు,గత సంవత్సరం జరిగిన మెగా ఆక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సీఈఓ అయినా కావ్య మారన్(Kavya maran) ,హెడ్ కోచ్ టామ్ మూడి లు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ ని అప్పుడు బాగా ట్రోల్ చేసారు.మెయిన్ ప్లేయర్స్ ఎవర్ని తీసుకోకుండా అనవసరమైన ప్లేయర్స్ ని కోట్లు పెట్టి కొన్నారు అని.అయితే ప్రస్తుతం జరుగుతున్న IPL లో హైదరాబాద్ టీం ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సమయం లో ఆ టీం సీఈఓ అయినా కావ్య మారన్ యొక్క ఆస్తుల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్న కూడా అక్కడికి వెళ్లి టీం ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ టీం సీఈఓ అయినా కావ్య మారన్.SRH మ్యాచ్ ల లో కెమరామెన్ లు సైతం కావ్య ని ఫోకస్ చేస్తూ ఉంటారు,ఆమె యొక్క క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయినా క్రికెట్ ఫాన్స్ అందరు ఆమెని కావ్య పాపా అంటారు.ఇంత కి ఈ కావ్య పాపా ఎవరో తెలుసా! తమిళనాడు లో వన్ అఫ్ ది రిచ్ బిజినెస్ పర్సన్ అయినా ‘కళానిధి మారన్’ యొక్క కుమార్తె.లక్షల కోట్ల కి వారసురాలు అయినా కూడా కావ్య ఎల్లప్పుడు కష్టపడుతూనే ఉంటారు. సన్ రైజర్స్ టీం తో పాటు ,సన్ టీవీ ,సన్ మ్యూజిక్ మొదలగు వాటి వ్యవహారాలను కావ్య చూస్తారు.ఇన్ని వ్యాపారాలను చేస్తున్న కావ్య పాపా కి దాదాపు 50 మిలియన్ అమెరికన్ డాలర్స్ ల నెట్ వర్త్ ఉంది,మన ఇండియన్ కరెన్సీ లో 400 కోట్ల పైన ఆస్తి కలిగి ఉన్నారు.

7655 views