NTR: జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఏమన్నాడంటే?

Posted by venditeravaartha, July 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ పాన్ వరల్డ్ లెవల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ మూవీ సీరియస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ గాడ్ ఫాదర్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే జూనియర్ మొన్నటి వరకు బయటి కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించలేదు. కానీ ఇటీవల కొన్ని ప్రత్యేక సినీ ఫంక్షన్లలో అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

devara

సినీ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. జూనియర్ ఎన్టీఆర్ తన పర్సనల్ విషయాల గురించి తక్కువగా మాట్లాడుతారు. అయతే తన చిన్న కుమారుడు గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు భార్గవ్ రామ్. ఇద్దరిలో చిన్న అబ్బాయి చురుకుగా ఉంటారని, నెక్ట్స్ స్టార్ హీరో అవుతాడని ఎన్టీఆర్ ఓ సినీ ఫంక్షన్లో చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్ష్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ntr

నందమూరి వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ కొనసాగిస్తాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మొన్నటి వరకు జూనియర్ అస్కార్ వేదికపై హంగామా చేశారు. ఇప్పుడు ‘దేవర’లో మాస్ లుక్ తో ఇప్పటికే మెప్పించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ కూడా నటించడంతో ఇప్పటికే హోప్స్ పెరిగాయి. ఈ మూవీతో కూడా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొడుతారని ఆశిస్తున్నారు.

koratala siva

అటు కొరటాల శివ సైతం ‘దేవర’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అంతకుముందు వరుస హిట్లు కొట్టిన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తీసిన మూవీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలన్న కసితో వర్క్ చేస్తున్నాడు. ఇక ‘దేవర’ పై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలువడుతున్నాయి. గతంలో ఓ హిందీ సినిమా లుక్ నే ఇప్పుడు కాపీ కొట్టారని కొందరు అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు.

1726 views