ఆ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశాను :వైష్ణవి చైతన్య

Posted by venditeravaartha, July 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కి సినిమా ల లో మంచి అవకాశాలు రావడం లేదు అంటూ
మొన్నటి వరకు అందరు అంటూనే ఉన్నారు.అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ ఉన్న వారికి ఛాన్స్ లు వస్తున్నాయి అనడానికి ఈ మధ్య రిలీజ్ అయినా బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అవకాశం ఇస్తే తాము ఏంటో నిరూపించింది.సోషల్ మీడియా లో చిన్న చిన్న షార్ట్స్ ,వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చిన వైష్ణవి సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా వైకుంఠ పురములో ,టక్ జగదీష్ ,వరుడు కావలెను వంటి సినిమా ల లో సైడ్ క్యారెక్టర్ లు చేసారు వైష్ణవి.

vaishavi

వైష్ణవి సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ తర్వాత తనకి వచ్చిన అవకాశాలని అన్నిటిని పూర్తి స్థాయి లో
ఉపయోగించుకున్నారు అనే చెప్పాలి .చిన్న చిన్న క్యారెక్టర్ లు అయినా తనకి గుర్తింపు ఉంటె చాలు అనుకుని చేసారు,అయితే ఆమె చేసిన కృషి కి బేబీ లో అవకాశం వచ్చింది.కేవలం మూడు నిముషాలు కనిపిస్తే చాలు అనుకునే స్థాయి నుంచి మూడు గంటలు సినిమా లో తానే ప్రధాన పాత్రా చేయడం తో వైష్ణవి ఆనందం కి అంతు లేకుండా పోయింది.బేబీ మూవీ రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ఇప్పటికే 60 కోట్ల గ్రాస్ సాధించింది.

baby

రచయత ,నిర్మాత అయినా సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటే అందులో క్రెడిట్ సగభాగం వైష్ణవి కి వస్తుంది.రెండు సంవత్సరాలు బేబీ కోసం తన టైం కేటాయించిన ఈమె ఈ సినిమా కోసం మరొక బ్లాక్ బస్టర్ సినిమా ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సంవత్సరం లో కమెడియన్ వేణు డైరెక్టర్ గా ప్రియదర్శి ప్రధాన పాత్రా లో వచ్చిన ‘బలగం’ సినిమా లో హీరోయిన్ గా మొదట వైష్ణవి చైతన్య ని అనుకున్నట్లు సాక్షాత్తు డైరెక్టర్ వేణు నే చెప్పారు.అయితే అప్పటికే బేబీ మూవీ షూటింగ్ లో ఉన్న వైష్ణవి బలగం సినిమా ని రిజెక్ట్ చేసారు అంట.ఇక ఇదే విషయాన్ని వైష్ణవి అడగక తాను అప్పుడు బేబీ సినిమా మీదనే ఫోకస్ చేశాను అని అలా చేయడం వలనే ఇప్పుడు ఇంత సక్సెస్ ,పేరు నాకు వచ్చాయి.బలగం మిస్ చేసుకుందుకు తనకి ఏమి బాధ లేదు అని అన్నారు.

balagam

2319 views