Kota srinivasarao:నేను చనిపోలేదు ,బ్రతికే ఉన్నాను :కోట శ్రీనివాస రావు

Posted by venditeravaartha, March 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో చాలా ఫేక్ న్యూస్ ని ప్రచురిస్తునారు ,అందులో ఏ మాత్రం కూడా వాస్తవం లేని వార్తల ను ప్రజల ముందు ఉంచి ,జనాల్ని అయోమయం లోకి తీసుకుని పోతున్నారు .ఇది ఏ స్థాయి కి వెల్లింది అంటే డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నే అయోమయం లో కి నెట్టేస్తున్నారు. నిన్న ఉగాది పండగ పర్వదిన న అందరు పండగ వాతావరణం లో ఉండగా ఒక న్యూస్ ఆశ్చర్యానికి గురి చేసింది. విలక్షణ నటులు అయినా కోట శ్రీనివాసరావు గా చనిపోయారు అనే న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది ,ఇది ఇలా ఉండగా సాక్షాత్తు ‘కోటశ్రీనివాస రావు ‘ గారు తాను బ్రతికే ఉన్నాను అని ఒక వీడియో రిలీజ్ చేసారు.


అనేక మీడియా పోర్టల్స్ మరియు యూట్యూబ్ ఛానెల్‌లు కోట శ్రీనివాసరావు మరణించినట్లు ప్రకటించడంతో ఆయన మరణ వార్తలను ఆయన స్వయంగా తోసిపుచ్చారు. మంగళవారం నటుడు సోషల్ మీడియా తనను చంపిందని, తన మరణానికి సంబంధించిన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కథనాల వల్ల ప్రభావితమైన రావ్ ఓ క్లారిటీ ఇచ్చారు.తన మరణంపై వచ్చిన పుకార్లను కొట్టిపారేయడానికి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పుకార్లు వ్యాప్తి చేసేవారు ఎవరి జీవితంతోనూ ఆడుకోవద్దని అన్నారు . పుకార్లు పుట్టించే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శ్రీనివాసరావు అన్నారు. నటుడు తన మరణం గురించి వచ్చిన పుకార్లను “దురదృష్టకరం” అని పేర్కొన్నాడు. “నేను చనిపోయినట్లు వారు ప్రకటించారని నా దృష్టికి వచ్చింది.

ఆ ఫేక్ న్యూస్ ని విన్న కొంత మంది మిత్రులు ,బంధువులు ఫోన్ లు మీద ఫోన్ లు చేసి పరామర్శించారు అని, ఇది ఆలా ఉంటె తెల్లారగానే ఒక 10 పైగా పోలీస్ వాళ్ళు తన ఇంటికి వచ్చారు అని ,కోట శ్రీనివాస్ రావు లాంటి యాక్టర్ చనిపోతే సినిమా ,రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం ఉండటం తో బందోబస్తు కోసం వచ్చాము అని అన్నారు, అయితే ఆ వచ్చిన పోలీస్ వాళ్ళ కి భవిష్యత్తులో నకిలీ మరణ వార్తలను అరికట్టేందుకు ఏదైనా చేయాలని నేను వారిని కోరుతున్నాను. ” . రేపు ఉగాది పండుగతో బిజీగా ఉన్న తరుణంలో ఫోన్‌ల పరంపర కలవరపెడుతోంది.. నా స్థానంలో ఎవరైనా పెద్దాయన ఉండి ఉంటే గుండె ఆగిపోయి నిజంగానే చనిపోయే వారు అని అన్నారు.వారికి పాపులారిటీ కావాలంటే లేదా డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ అలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదు.

అయితే కోట శ్రీనివాస రావు గారు మొదట బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ కొన్ని స్టేజి నాటకాలు చేసే వారు తర్వాత చిరంజీవి గారి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెరంగేట్రం చేశారు.కొన్ని క్యారక్టర్ ల లో తాను మాత్రమే చేయగలరు అనే విధంగా చేసారు అందులో ప్రతిఘటన,గణేష్ సినిమా ల లో బెస్ట్ విల్లన్ గా నంది అవార్డు ల ను కూడా గెలుపొందారు.తెలుగు సినిమా లో ఎన్ని కామెడీ కాంబినేషన్ లు ఉన్న ,కోట శ్రీనివాస రావు గారు ,బాబు మోహన్ గారి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏ వేరు ,వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ల లో 90 % వరకు సూపర్ హిట్లు ఉన్నాయి ,90 ‘s ల లో వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మామగారు ,చినరాయుడు ,బావ బావమరిది మొదలగు చిత్రాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.


‘ఆహా నా పెళ్ళంటా’ సినిమా లో తాను చేసిన పిసినారి క్యారెక్టర్ ఇంకా ఎవరు చేయలేరు అన్నట్లు చేసారు. క్యారెక్టర్ యాక్టర్ గా 750 కి పైగా సినిమాల్లో నటించారు. అతను కొన్ని తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ సినిమాలలో కూడా భాగమయ్యాడు.
అటల్ బిహారి వాజపేయి నాయకత్వం అంటే ఇష్టపడే కోట గారు , 1990లలో బీజేపీలో చేరారు 1999లో విజయవాడ తూర్పు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.

263 views