మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) మొదట తొలివలపు మూవీ లో హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేదు ఆ తర్వాత విల్లన్ గా జయం ,నిజం ,వర్షం మూవీ ల తో సక్సెస్ అయ్యారు.2004 లో రిలీజ్ అయినా యజ్ఞం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్, ఆంధ్రుడు,రణం,లక్ష్యం వంటి సూపర్ హిట్ల తో స్టార్ హీరో గా మారారు.అయితే తన రీసెంట్ సినిమా లు ఆశించిన స్థాయి లో సక్సెస్ కావడం లేదు.2014 లో రిలీజ్ అయినా లౌక్యం సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ఇంతవరకు రాలేదు.దాదాపు ఈ 9 సంవత్సరాల లో రిలీజ్ అయినా తన 10 సినిమా లు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.సక్సెస్ కోసం తన లక్కీ డైరెక్టర్ శ్రీవాస్ తో ఈ మధ్య రిలీజ్ అయినా ‘రామబాణం'(Rama banam) సినిమా కూడా డిజాస్టర్ కావడం తో గోపీచంద్ తన తదుపరి చిత్రం కోసం కన్నడ డైరెక్టర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
కన్నడ కొరియోగ్రాఫర్,డైరెక్టర్ అయినా హర్ష.ఏ(A.Harsha) తో గోపీచంద్ సినిమా ఉండబోతుంది అని టాక్ ఈ సినిమా లో గోపీచంద్ సరసన మాళవిక శర్మ(Malavika sharma) హీరోయిన్ గా నటించనున్నారు.ఈ సినిమా ని హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకునిరాబోతున్నారు.మాళవిక శర్మ ఇది వరకే తెలుగు లో రామ్ గారి ‘రెడ్’ సినిమా లోను ,రవితేజ గారి నేలటికెట్ లో కనిపించారు.శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె కె రాధా మోహన్ గారు ఈ సినిమా ని నిర్మించనున్నారు,ఈయన ఇదివరకే గోపీచంద్ గారి పంతం సినిమా కి నిర్మాత గా వ్యవహరించారు.
కన్నడ లో యాక్షన్ చిత్రాలను తీయడం లో ప్రసిద్ధి చెందిన హర్ష అక్కడ సూపర్ స్టార్ అయినా శివరాజకుమార్(Shiva rajkumar) గారితో వేద,శివ వేద,భజరంగి ,జై భజరంగి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు ఇక ఇప్పుడు ఆయన తెలుగు లో తన డెబ్యూ మూవీ ని గోపీచంద్ గారితో తీయనున్నారు.ఈ మూవీ ద్వారా అయినా గోపిచంద్ గారు సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.