Rajamouli: తన నటన తో రాజమౌళి నే భయపెట్టిన ఆ హీరో ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ముఖ్య కారణం కథ.కథ బావుంటే సినిమా లు దాదాపు చాలా వరకు సూపర్ హిట్లు అవుతాయి.మరి కొన్ని చిత్రాలు కథ సరిగా లేకపోయినా ఆ సినిమా లోని హీరో ని బట్టి కూడా హిట్ అవుతుంటాయి.హీరో యొక్క స్టార్ ఇమేజ్ సినిమా కి ఎంతగానో హెల్ప్ అవుతుంది.కానీ మరికొన్ని సినిమా లు ఆ సినిమా డైరెక్టర్ ని బేస్ చేసుకుని హిట్ అవుతుంటాయి ఆ జాబితా లో మొదటి ప్లేస్ లో ఉంటారు రాజమౌళి(Rajamouli).రాజమౌళి తో పని చేయాలి అని ఇండియా లో ఉన్న ప్రతి స్టార్ అనుకుంటారు.కానీ తన స్టోరీ కి సరిపడే హీరో ల తోనే వర్క్ చేసే రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన సినిమా ల తో ఆ హీరో ల కి వాళ్ళ కెరీర్ బెస్ట్ హిట్ల ని ఇచ్చాడు.

Rajamouli cinemas

జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1(Student no1) తో తన కెరీర్ ని ప్రారంభించిన రాజమౌళి ఇప్పటి వరకు 11 సినిమా ల ని మాత్రమే డైరెక్ట్ చేసాడు.అందులో ఎన్టీఆర్ ,ప్రభాస్ ,సునీల్ ,రామ్ చరణ్ ,నాని ,నితిన్,రవి తేజ లు హీరో లు గా చేసారు.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ అయినా సింహాద్రి ,యమదొంగ సినిమా లకి జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు వచ్చిందో దానికి రెట్టింపు రాజమౌళి కి వచ్చింది.అలానే రామ్ చరణ్ మగధీర కి చాల వరకు క్రెడిట్ రాజమౌళి దే ఇక నాని ఈగ ,సునీల్ మర్యాద రామన్న,నితిన్ సై సినిమా ల ఫుల్ క్రెడిట్ రాజమౌళి..ప్రభాస్ తో చేసిన ఛత్రపతి ,బాహుబలి సినిమా ల లో ప్రభాస్ ,రాజమౌళి ఇద్దరికీ సమానంగా క్రెడిట్ వచ్చింది.

vikramarkudu

తన 11 సినిమా ల లో తన ట్రేడ్ మార్క్ ని మించి ఇది రాజమౌళి సినిమా అనే దానికి కంటే కూడా ఇది ఆ హీరో సినిమా అనేలా ఒక సినిమా రాజమౌళి నే భయపెట్టింది అదే విక్రమార్కుడు. (Vikramarkudu) రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ విక్రమార్కుడు లో రవితేజ తన నటన తో రాజమౌళి డైరెక్షన్ నే డామినేట్ చేసాడు.ఫస్ట్ టైం రాజమౌళి ఆ సినిమా చూసాక రవితేజ(Raviteja) ని కలిసి ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే విక్రమ్ సింగ్ రాథోర్ క్యారెక్టర్ ని డీల్ చేసిన రవితేజ ని పొగడతాల్తో ముంచెత్తాడు  అన్నారు.అయితే రాజమౌళి ఇప్పటి వరకు తాను పని చేసిన ఈ ఒక్క హీరో ని కూడా పొగడాడు అని పేరు ఉంది.కానీ రవితేజ ని మాత్రం పొగడకుండా ఉండలేకపోయారు అంటే రవితేజ గారి రేంజ్ ఎలాంటిదో తెలుస్తుంది.

 

ravi teja rajamouli

965 views