BICHAGADU:బ్లాక్ బస్టర్ ‘బిచ్చగాడు ‘ సినిమా ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో !

Posted by venditeravaartha, April 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక సినిమా హిట్ అయినా తర్వాత ,ఆ హీరో కాకుండా ఇంకో హీరో ఆ సినిమా చేసి ఉంటె ఎలా ఉండేది అని చాల మంది అనుకుంటున్నారు,అదే సినిమా ప్లాప్ అయితే ఇంకో హీరో చేస్తే బావుండేది అని కూడా అనుకుంటారు ,అది వారి ఊహ మాత్రమే అయినప్పటికీ కొన్ని సినిమా లు ఒక హీరో దగ్గర కి వెళ్లి ఆ హీరో రిజెక్ట్ చేయడం వలనో లేక బడ్జెట్ వలనో ,ఇతర ఇతర కారణాల వలన కొన్ని సినిమా ఆగిపోతాయి ,మరి కొన్ని సినిమా లు వేరే హీరో లు చేస్తారు ,అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము,ఆ సినిమా ఏంటి అంటే ‘బిచ్చగాడు’.

విజయ్ ఆంటోనీ హీరో గా ,నిర్మాత ,మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’,తమిళ్ లో పిచయ్క్కారం గా రిలీజ్ అయినా ఈ సినిమా రెండు బాషా ల లోను సూపర్ హిట్ అయింది,ఇంకా గట్టిగా చెప్పాలి అంటే తమిళ్ లో కంటే తెలుగు లోనే పెద్ద హిట్ గా నిలిచింది బిచ్చగాడు.అయితే మొదట గా ఈ సినిమా ని మన టాలీవుడ్ స్టార్ అయినా ‘శ్రీకాంత్ ‘ గారి దగ్గర కి వచ్చింది అని ఇటీవల ఆయనే స్వయంగా చెప్పారు.

ఇటీవల ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ మాట్లాడుతూ తన 100 వ సినిమా అయినా ‘మహాత్మా’ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ ఆంటోనీ ,అప్పటి నుంచి విజయ్ తో మంచి రిలేషన్ ఉంది ,అయితే తమిళ్ లో రిలీజ్ అయినా తర్వాత బిచ్చగాడు సినిమా చూసాక నాకు బాగా నచ్చింది.అయితే ఆ సినిమా ని తెలుగు లో రీమేక్ చేద్దాం అనుకుని ప్రొడ్యూసర్స్ ల తో ,డైరెక్టర్ తో చర్చలు కూడా జరిగాయి ,కానీ బడ్జెట్ ,డేట్స్ ల వలన ఆ సినిమా చేయలేకపోయాను అని చెప్పారు.ఒక వేళా తెలుగు లో శ్రీకాంత్ గారు చేసి ఉంటె ఎలా ఉండేదో చెప్పండి.

725 views