రానున్న ఎలక్షన్ లలో అధికారమే లక్ష్యం గా టీడీపీ తన రాజకీయ వ్యూహాలను కదుపుతుంది. రాజకీయ క్రియాత్మకమైన నిర్ణయాలు తీసుకోడానికి కూడా సిద్దమవుతుంది అని చెప్పాలి వైసీపీ చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు తెలియజేయాలని దానికి సంసిద్ధంగా టీడీపీ పండుగ మహానాడు కి సిద్దమవుతుంది. దీనికి నిన్న రాజమండ్రి లోని వేమగిరిలో భూమి పూజ చేసారు దీనికి కీలకంగా 2024 ఎన్నికలు కు సమర శంఖం పూరించాలన్నదే లక్ష్యం గా మహానాడు నిర్వహణ ప్రాంగణానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకట రమణ చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బొడ్డు వెంకట రమణ మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రి లో మహానాడు అత్యంత వైభవంగా జరుగుతుందని దానికి కావలసిన ఏర్పాట్లని తెలుగుదేశం పార్టీ చేసింది అని దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారని రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరుకు దాదాపు 1500 మంది ప్రతినిధులతో మహానాడు నిర్వహణ కు 15 కమిటీలతో ఏర్పాటు చేసారని చెప్పారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పాటు అయ్యింది అని ఆయన చెప్పారు. మహానాడు అన్నది టీడీపీ కార్యకర్త లకు ఒక పండుగ కాబట్టి అందరూ హాజరుకావాలని యువత ఉత్సహంగా పనిచేయాలని అయన కోరారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడులో కార్యకర్త లకు దిశా నిర్దేశం చేసి రానున్న ఎన్నికల బరిలో విజయం సాధించాలని భావిస్తుంది ఈ వేదిక మీద పొత్తుల మీద క్లారిటీ కూడా వస్తుంది అని టీడీపీ వర్గాల శ్రేణులు అంటున్నారు. టీడీపీ మహానాడులో బీజేపీ జనసేన పొత్తు విష్యం పై హాట్ టాపిక్ గా మారనుంది.