Iliyana:ఇలియానా పై నిషేధం , 10 ఏళ్ళ తర్వాత బయట పడ్డ అసలు నిజం !

Posted by venditeravaartha, March 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇలియానా పై నిషేధం , 10 ఏళ్ళ తర్వాత బయట పడ్డ అసలు నిజం !
2006 లో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ ‘దేవదాసు’ సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయ్యారు ఇలియానా,ఈ సినిమా లో హీరో రామ్ పోతినేని, ఇద్దరికీ ఇదే మొదటి సినిమా,దేవదాసు సినిమా షూటింగ్ లో ఉండగానే ఇలియానా కి వరుస అవకాశాలు వచ్చాయి ,పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిడం తో ఇలియానా తన రెమ్యూనిరేషన్ ని అమాంతం పెంచేవారు దాదాపు అప్పట్లోనే కోటి రూపాయలు తీసుకున్న తెలుగు హీరోయిన్ గా రికార్డు ల లో ఎక్కారు.

తెలుగు ,తమిళ సినిమా ల లో బిజీ గా ఉన్న సమయం లోనే ఇలియానా బాలీవుడ్ లోకి 2012 లో బర్ఫీ సినిమా తో ఎంట్రీ ఇచ్చారు,2012 తెలుగు లో తాను నటించిన ‘జులాయి’,’దేవుడు చేసిన మనుషులు ‘ ల లో జులాయి సూపర్ హిట్ సాధించింది, అయితే ఇదే సమయం లో ఇలియానా తమిళ్ లో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు, ఈ సినిమా లో హీరో విక్రమ్ ,నిర్మాత నటరాజ్. నందన్ గా సినిమా పేరు ని అనుకున్నారు, ఈ సినిమా కోసం ఇలియానా కి అడ్వాన్స్ కింద 40 లక్షల రూపాయలు ఇచ్చారు.

అయితే అనుకోని కారణాల వాళ్ళ ఆ సినిమా ఆగిపోయింది,దాంతో తనకి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సింది గా ఆ సినిమా నిర్మాతలు ఇలియానా ని అడిగారు,దానికి ఇలియానా నిరాకరించారు.కావాలి అంటే మరో సినిమా లో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను అని తెగేసి చెప్పేసారు.దీంతో సదరు నిర్మాతలు నడిగర్ సంఘం తో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా ఇలియానా మీద కంప్లైంట్ చేసారు. అయితే ఎవరు ఎన్ని చేసిన తాను తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను అని చెప్పేసారు ఇలియానా. అయితే ఇక చేసేది ఏమి లేక ఆమె మీద 10 సంవత్సరాలు పాటు నిషేధం వేశారు.

సౌత్ లో తన ని బ్యాన్ చేసినప్పటికీ బాలీవుడ్ లో వరుస సినిమా ల లో నటించే అవకాశం లభించింది, తాను నటించిన బాలీవుడ్ సినిమా లలో ఎక్కువ శాతం హిట్లు ఉన్నపటికీ తనకి మాత్రం మంచి పేరు రాలేదు , 6 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరవాత శ్రీను వైట్ల ,రవి తేజ గారి కలయిక లో వచ్చిన తెలుగు మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ ‘ సినిమా తో తెలుగు లో నటించారు ఇలియానా.

అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది.అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా మొదలు కాకముందే ఇలియానా మీద నిషేధం తీసేసారు ,మరి తాను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారా? లేక తన మీద విధించిన నిషేధ కాలం గడిచి పోయిందా అనేది స్పష్టం గా తెలియాల్సి ఉంది, కానీ తెలుగు లో తాను నటించిన సినిమా లు మాత్రం ఇలియానా ని మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి.

449 views