Anni Manchi Sakunamule:అన్ని మంచి శకునములే మూవీ రివ్యూ !

Posted by venditeravaartha, May 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ ల లో నందిని రెడ్డి(Nandini reddy) గారిది సెపెరేట్ స్టైల్ తన మొదటి సినిమా అలా మొదలైంది(Ala modalaindi) తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు,ఇక ఆ తరువాత జబర్దస్త్ ,కల్యాణ వైభోగ్యమే వంటి సినిమా లు నిరాశ పరిచిన సమంత గారితో చేసిన ఓ బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇక ఇప్పుడు యువ హీరో సంతోష్ శోభన్(Santhosh sobhan) తో కలిసి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని మంచి శకునములే(Anni Manchi Sakunamule) సినిమా మే 18 న రిలీజ్ అయింది.భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఈ వేసవిని చల్లగా చేస్తుంది అన్న క్యాప్షన్ తో వచ్చింది .మరి కమర్షియల్ హిట్ లేకుండా వరుసగా సినిమా చేస్తున్న సంతోష్ శోభన్ కి ఈ సినిమా అయినా హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.

కథ : రిషి(సంతోష్ శోభన్) అల్లరిగా తిరుగుతూ తన లైఫ్ ని సాగిస్తూ ఉంటాడు తనకి ఆర్య(మాళవిక నాయర్) పరిచయం అవుతూ ఆ పరిచయఎం కాస్త ప్రేమ గా మారుతుంది. రిషి తండ్రి సుధాకర్ (నరేష్),ఆర్య తండ్రి ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) ల కి దివాకర్(రావు రమేష్) ల మధ్య ఆస్తి వివాదాల తో కోర్ట్ కేసు లు నడుస్తూ ఉంటాయి.కానీ నిజానికి రిషి,ఆర్య లు తాము పుట్టినప్పుడే హాస్పిటల్ లో నర్సుల చేత మార్చపడుతారు అంటే రిషి వాళ్ళ తండ్రి దగ్గరకు ఆర్య ,ఆర్య వాళ్ళ తండ్రి దగ్గర కి రిషి.అసలు ఎందుకు వీరు మార్చపడ్డారు ,ఇలా జరిగింది అని వాళ్ళ తల్లి తండ్రుల కి తెలిసిందా ,అసలు ఆ కోర్ట్ గొడవలు ఎందుకు వచ్చాయి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:సంతోష్ శోభన్ క్యారెక్టర్ తన ముందు చిత్రాల మధారిగానే అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్ లో బాగానే నటించారు అయితే అతను ఈ చిత్రంలో కొత్త కోణాన్ని తీసుకువచ్చాడు మరియు అతని గత చిత్రాలతో పోల్చినప్పుడు అతని నటన కూడా చాలా మెరుగుపడింది. మాళవిక నాయర్ తన పాత్రలో కూడా బాగుంది ఈ సినిమా కి ప్రధాన బలం తారాగణం, ఇందులో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి మరియు అనేక మంది అనుభవజ్ఞులైన నటులు ఉన్నారు,సీనియర్ నటులు వారి పాత్రలకి న్యాయం చేసారు..నందిని రెడ్డి గారు ఈ కథ ద్వారా తాను ఏది అయితే చెప్పాలి అనుకుందో దానిని క్లియర్ గా చెప్పగలిగారు.గెస్ట్ పాత్రా ల లో తొలిప్రేమ ఫేమ్ వాసుకి,వెన్నల కిషోర్ అలరించారు.స్వప్న సినిమా ఈ సినిమా ని మంచి ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు.అలానే మిక్కీ జె మేయర్ సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.కాకపోతే పాత కథ కి కొంచెం కామెడీ చివరి లో ఎమోషన్స్ కలిపి తీసినట్లు అనిపిస్తుంది.

పాజిటివ్ :నటి,నటులు,ఎమోషనల్ సీన్ లు ,కామెడీ.
నెగటివ్:కథ ,స్క్రీన్ ప్లే ,స్లో నారేషన్.
రేటింగ్:2 .25 / 5
చివరిగా అన్ని మంచి శకునములే సినిమా లో మంచి కథ కూడా ఉండి ఉంటె బాగుండేది.

1253 views