Andhra politics: అంబటి రాంబాబు నువ్వు మంత్రి వా ? సినిమా క్రిటిక్ వా ?

Posted by venditeravaartha, August 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయో యావత్ భారత దేశం మొత్తం నవ్వుకునే లా ఉన్నాయి అని అంటున్నారు,దానికి కారణం ప్రభుత్వం అని క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యే లు అధికార ప్రతినిధులు తాము ఎటువంటి తప్పు చేయడం లేదు అని కావాలనే ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయి చెప్తున్నారు.ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర లో ప్రభుత్వం లో జరుగుతున్న వాటి గురించి అభివృద్ధి లేకుండా చేస్తున్న అప్పులు ,మిస్సింగ్ కేసు లు ,డేటా చోరీ ల గురించి అడిగిన ప్రశ్న ల కి సమాధానం చెప్పకుండా రివర్స్ లో ఎటాక్ చేసి తాము ఎలాంటి వారో తెలియచేసారు.ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా మీద వైసీపీ పార్టీ చేస్తున్న అనవసరమైన రచ్చ ఇప్పుడు తార స్థాయి కి చేరింది అనొచ్చు.

ambati

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మంత్రివర్గం లో తమ శాఖ కి చెందిన వ్యవహారాల లో ఎవరు కూడా సరిగా పని చేయడం లేదు అనేది స్పష్టం గా కనిపిస్తుంది.జులై 28 న రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా మొదటి షో నుంచి సూపర్ టాక్ తో మంచి కలెక్షన్ ల ను సాధించి మొదటి మూడు రోజుల్లో నే బ్రేక్ ఈవెన్ సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా లో నిమిషం కంటే తక్కువ క్యారెక్టర్ ఉన్న శ్యాంబాబు అనే పాత్రా తనని పోలి ఉంది అంటూ బ్రో సినిమా గురించి ఇటీవల వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు ఆంధ్ర మినిస్టర్ అంబటి రాంబాబు.సినిమా ల గురించి రివ్యూ లు ,కలెక్షన్ లు రాయడానికి కొన్ని వందల వెబ్ సైట్ లు ఉన్నాయి ఇక ఆ సినిమా కి సంబందించిన కలెక్షన్ ల ను వారే స్వయంగా పోస్టర్ ల రూపం లో రిలీజ్ చేస్తారు.ఒక వేళా సినిమా ప్లాప్ అయినా ,హిట్ అయినా ఆ నిర్మాత కె తెలుస్తుంది అలాంటింది

rambabu prudvi

బాద్యతమైన మంత్రి పదవి లో ఉండి ఒక సినిమా రివ్యూ ,కలెక్షన్ లు చెప్పే స్థాయికి దిగజారి పోయారు అంటే ఆంధ్ర లో రాజకీయాలు ఏ స్థాయి లో ఉన్నాయో తెలుస్తుంది.ఇక సినిమా కి బడ్జెట్ ని అమెరికా నుంచి తెస్తే ఏంటి అమలాపురం నుంచి తెస్తే ఏమిటి ,వారికీ ఉన్న సోర్స్ ని బట్టి నిర్మాతలు సినిమా కి ఫండింగ్ చేసుకుంటారు ,ఇన్కమ్ టాక్స్ కి ఫైల్ చేస్తారు.ఆ విషయం ని ఎవ్వరికి కూడా చెప్పాల్సిన పరిస్థితి కానీ అవసరం కానీ ఉండదు.మరి అంబటి రాంబాబు
ఎందుకు కావాలి అనే తన శాఖ ని పక్కన పెట్టి సినిమా ల మీద ఫోకస్ చేస్తున్నారు.

405 views