‘ఉగ్రం’ మొదటి రోజు వసూళ్లు..బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

Posted by venditeravaartha, May 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నిన్నటి తరం లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ జానర్ సినిమాలకు ఎలాంటి ట్రేడ్ మార్కు లాగ ఉండేవాడో, నేటి తరం హీరోలలో అలా అల్లరి నరేష్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.తొలిసినిమా నుండే కామెడీ జానర్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, మద్యమద్యలో సీరియస్ పాత్రలు కూడా చేసాడు.వాటిల్లో ‘గమ్యం’ వంటి చిత్రాలలో ఆయన నటనకి మంచి మార్కులు కూడా పడ్డాయి,అయితే మధ్యలో ఆయన ఒకే మూస కామెడీ సినిమాలు చెయ్యడం వల్ల వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి.అప్పటి నుండి ఆయన తన రూటుని మార్చి ‘నాంది’ అనే సినిమా చేసాడు,ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత ‘మారేడు మల్లి నియోజకవర్గం’ అనే చిత్రం చేసాడు, ఇది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు, ఇప్పుడు ఆయన ‘ఉగ్రం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.

ugram telugu movie review

ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది, అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు అనే టాక్ కూడా వచ్చింది,మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతానికి కలిపి కేవలం 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇది అల్లరి నరేష్ రేంజ్ కి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.నైజాం లో 23 లక్షలు, సీడెడ్ లో 10 లక్షలు , ఉత్తరాంధ్ర లో 7 లక్షలు , ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలకు కలిపి 8 లక్షలు, గుంటూరు మరియు కృష్ణ జిల్లాలకు కలిపి 10 లక్షలు, నెల్లూరు జిల్లాకు 3 లక్షలు వసూలు చేసింది.అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 61 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా 73 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం.

ugram telugu movie review

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు రాబట్టింది, రెండవ రోజు కూడా అన్నీ చోట్ల డీసెంట్ గానే వసూళ్లు ప్రారంభం అయ్యాయి,అలా మూడు రోజులకు మూడు కోట్ల రూపాయలకు దగ్గరగా ఈ చిత్రం వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఇక ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించగలిగితే, వచ్చే వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, మరి అల్లరి నరేష్ లక్ ఎలా ఉందొ చూడాలి.వరుసగా మూడు సీరియస్ సినిమాలు చేసేలోపు అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

711 views