Koratala Siva: ఆచార్య తర్వాత నన్ను ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్టారు : కొరటాల శివ

Posted by venditeravaartha, May 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా లు తీసే డైరెక్టర్ ల లో టాప్ లో ఉంటారు కొరటాల శివ(Koratala Shiva).మొదట రచయత గా ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కొరటాల శివ..తన మొదటి  సినిమా మిర్చి(Mirchi) ని రెబెల్ స్టార్ ప్రభాస్ తో 2013 లో రిలీజ్ చేసారు.అప్పటి వరకు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ని రెట్టింపు చేసిన సినిమా మిర్చి.బాహుబలి సినిమా లో ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మిర్చి సినిమా నే కారణం అని రాజమౌళి గారు చాల సార్లు చెప్పారు అంటే ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది.కమర్షియల్ సినిమా లో సోషల్ మెసేజ్ ని ఇవ్వడం లో కొరటాల సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు తో చేసిన శ్రీమంతుడు,భరత్ అనే నేను అలానే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

వరుస సూపర్ హిట్లు ఉన్న కొరటాల శివ ని ఒక్క సినిమా కింద స్థాయి కి తీసుకుని వచ్చేసింది తన మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ చేసేలా చేసింది.అదే మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య(Acharya) మూవీ.రామ్ చరణ్ అతిధి పాత్రా లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది.అయితే సినిమా ఫెయిల్యూర్ ని కేవలం డైరెక్టర్ మీద మాత్రమే నెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి గారు.చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం డైరెక్టర్ ని బ్యాక్ చేయకపోవడం తో కొరటాల మీద అందరికి నమ్మకం పోయింది.ఇక ఆచార్య సినిమా కి ముందే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని ప్రకటించేసారు.సినిమా డిజాస్టర్ కావడం తో కొరటాల తో ఎన్టీఆర్ సినిమా ఆగిపోతుంది అని వార్తలు వచ్చాయి.

ఈ మధ్య కొరటాల శివ ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆచార్య ఫెయిల్యూర్ వలన మా ఇంట్లో వాళ్లే నన్ను నమ్మలేదు.ఇక నేను మరల సక్సెస్ అవడం కష్టం అనే ఫీల్ తెచ్చారు నా చుట్టూ ఉన్న వారు.ఇక అదే సమయం లో ఎన్టీఆర్(NTR) గారితో సినిమా కూడా పోతుంది అనుకున్న కానీ ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి కథ కి ఇంకొంచెం మార్పులు చేసుకుని రా ఈ సరి మనం తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని నన్ను ఎంకరేజ్ చేసారు.ఆయన ఇచ్చిన ధైర్యం ఈ మొన్న మీరు చుసిన దేవర పోస్టర్.జనతా గ్యారేజ్ కి 10 రెట్లు మించిన బ్లాక్ బస్టర్ ఈ సారి ఇవ్వబోతున్న అని అన్నారు.

586 views