Adipursh: బాహుబలి ,ఆర్ ఆర్ ఆర్ లని మించి రికార్డు స్థాయి లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్!

Posted by venditeravaartha, May 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సినిమా తో పాన్ ఇండియన్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ సినిమా లు చేస్తూ బిజీ గా ప్రభాస్(Prabhas) త్వరలోనే తన ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ కాబోతున్నారు.బాలీవుడ్ లో తానాజీ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ నుంచి వస్తున్న సినిమా ఆదిపురుష్.ఇందులో ప్రభాస్ శ్రీ రాముడు గా చేస్తుండగా అయన కి జోడి గా సీత పాత్ర లో కృతి సనన్(Kriti sanon) నటిస్తున్నారు.ఇక జూన్ 16 న రిలీజ్ కానున్న ఆదిపురుష్ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లా మేర ఉండటం తో దాని ప్రీ రిలీజ్ కూడా అంతకు మించి జరుగుతుంది.

adipursh

సాహూ ,రాధే శ్యామ్ సినిమా లు ఆశించిన స్థాయి లో ఆడకపోయినప్పటికీ ప్రభాస్ మార్కెట్ ఏ మాత్రం ఇంచ్ కూడా తగ్గలేదు అని ఆదిపురుష్(Adipursh) మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చెపుతోంది.సాహూ హిందీ మార్కెట్ లో మంచి వసూళ్లు రాబట్టిన తెలుగు లో బ్రేక్ ఈవెన్ కాలేదు.ఇక రాధే శ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను మిగిల్చింది.ఆదిపురుష్ ని టి సిరీస్ రెట్రోఫిల్స్ సంయుక్త్మగా నిర్మించగా తెలుగు రాష్ట్రాల రైట్స్ ని UV వాళ్ళు మొదట గా సొంతం చేసుకున్నారు.కానీ ఇప్పుడు వేరే కంపెనీ కి పెద్ద మొత్తం లో ఆఫర్ రావడం తో ఆదిపురుష్ ధియేటరికల్ రైట్స్ ని ఆ సంస్థ కి ఇచ్చేయనున్నారు అని సమాచారం.

prabhas

గూఢచారి,ఓ బేబీ ,ధమాకా లాంటి సూపర్ హిట్ సినిమా లని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఆదిపురుష్ తెలుగు ధియేటరికల్ రైట్స్ ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
దాదాపు 170 నుంచి 180 కోట్లా మధ్య డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.హైయెస్ట్ గా నిజం ఏరియా లో 80 కోట్లా కి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల లో ఇదే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్.ఇక దీనితో పాటు ప్రభాస్ ,సందీప్ రెడ్డి వంగ ల స్పిరిట్ సినిమా లో కూడా పీపుల్ మీడియా వాళ్ళు భాగం కానున్నారు.

628 views