Adipursh:ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ ! ఈ సారి టార్గెట్ 2000 కోట్లు పక్కా!

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ని ఇండియన్ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి కి తీసుకుని వెళ్లిన హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షాక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు మరొక సారి తన స్టామినా ని మరో సారి చూపించడానికి ‘ఆదిపురుష్’ సినిమా తో రాబోతున్నారు.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ స్థాయి లో తీస్తున్నారు, ఈ సినిమా ని 600 కోట్ల భారీ బడ్జెట్ తో ‘టి సిరీస్’ ‘రెట్రో ఫిల్స్’ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతర్,రాజేష్ నాయర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది వరకు రిలీజ్ అయినా టీజర్ మీద విపరీతమై ట్రోల్ల్స్ అందుకున్న ఈ సినిమా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది.మరి ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం !

ఇది నా రాముడి కథ ,అయన మనిషి గా పుట్టిన మహనీయుడు అయన జీవితం ధర్మానికి నిదర్శం అంటూ హనుమాన్ మాటల తో మొదలైన ఆదిపురుష్ ట్రైలర్ లో రావణాసుర క్యారెక్టర్ లో ఉన్న సైఫాలీఖాన్ సీత ని లంక కి తీసుకుని పోవడం ,ఈ రఘువంశానికి యువరాజు మీరు ఒక్క మాట చెప్తే లంక ని దహనం చేసి వదినమ్మ ని తీసుకుని వస్తాం అని చెప్పిన లక్ష్మణుడి కి ‘జానకి దగ్గర ఏ ఉంది నా ప్రాణం ,నా ప్రాణం కంటే నాకు ధర్మ ఏ ముఖ్యం’ అని వచ్చే డైలాగ్ హైలైట్ అయింది,అలానే రాఘవుడు నన్ను పొందడానికి శివధనుస్సు ని విరిచాడు ,ఇప్ప్పుడు రావణాసురుడు ని గర్వాన్ని విరిచేయాలి అనే డైలాగ్ ఇంకా హైలైట్ అనే చెప్పాలి,బ్రహ్మాండం లో పొందాల్సిన వి అన్ని పొందుతున్న ఇంకా నువ్వు రాక్షసుడు వే అంటూ రావణాసురుడి ని అనడం తో ట్రైలర్ ముగిసింది.3 .19 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ లో డైరెక్టర్ ఎక్కువగా హనుమాన్ ,రాముడు ,సీత ల మీద ఫోకస్ చేసి టీజర్ లో గ్రాఫిక్స్ మీద వచ్చిన ట్రోల్ల్స్ ని చెరిపేస్తూ ఇది కదా మనకి కావాల్సిన సినిమా అన్నట్లుగా చేసారు.రామ్ జై శ్రీ రామ్ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.ఇక జూన్ 16 నా ఆదిపురుష్ చేసే సిల్వర్ స్క్రీన్ మాయాజాలం కోసం అందరు వెయిట్ చేయక తప్పదు.

పాజిటివ్ :ప్రభాస్ ,కృతి సనన్ ,హనుమాన్ డైలాగ్స్ ,గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
నెగటివ్:టీజర్ నుంచి ఓం రౌత్ చాల నేర్చుకున్నారు అని చెప్పాలి.
రేటింగ్:5 / 5
చివరగా ఇది ధర్మాన్ని రక్షించే శ్రీరాముడి కథ .. జై శ్రీ రామ్ !

1703 views