Tollywood: అప్పట్లో బ్రహ్మానందం నే భయపెట్టిన ఆ కమెడియన్ ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ గా అప్పట్లో అల్లు రామలింగయ్య ,రాజబాబు ,రేలంగి ఇలా చాల మంది ఉండే వారు వారి తర్వాత తెలుగు సినిమా ల లో తన కంటూ ఒక కామెడీ స్టైల్ మరియు అభిమానులని ఏర్పరచుకున్నారు బ్రహ్మానందం(Bramhandam) గారు.చిరంజీవి గారి చంటబ్బాయ్ సినిమా తో సినిమా ల లో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం..చాల తక్కువ సమయం లోనే సక్సెస్ అయ్యారు. తన హావభావాల తో ప్రతి ఒక్కరిని నవ్వించే బ్రహ్మానందం గారు ఒకప్పుడు రిలీజ్ అయినా ప్రతి సినిమా లోను తన క్యారెక్టర్ ఉండేది.ఇక కొంత మంది డైరెక్టర్ లు ఉదాహరణకి జంధ్యాల ,రేలంగి నరసింహ రావు ,శివ నాగేశ్వర రావు ,శ్రీను వైట్ల లాంటి వారు తన కోసమే ప్రత్యేకమైన పాత్రలని డిజైన్ చేసేవారు.

bramhi

కేవలం కామెడీ పాత్రలే కాకుండా బాబాయ్ హోటల్ ,సూపర్ హీరోస్ వంటి సినిమా ల లో హీరో గాను చేసిన బ్రహ్మానందం గారు 1990 ‘s ల లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల బిజీ బిజీ గా ఉన్న కమెడియన్ అయ్యారు.ఇక అదే సమయం లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో రచయిత గా అవ్వాలి అని వచ్చి కమెడియన్ అయినా MS నారాయణ(MS narayana) గారు తనకంటూ సెపెరేట్ స్టైల్ తో చాల తక్కువ సమయం లోనే టాప్ కమెడియన్ గా ఎదిగారు.మోహన్ బాబు సూపర్ హిట్ ఫిలిం పెదరాయుడు లో ఆచారి పాత్రా తో తెలుగు సినిమా లో ఎంట్రీ ఇచ్చిన MS నారాయణ గారు ఆ తర్వాత వరుసగా సినిమా లు చేస్తూ దాదాపు గా 750 కి పైగా సినిమా ల లో చేసారు.

ms and bramhi

బ్రహ్మానందం గారి డేట్స్ దొరకని ప్రొడ్యూసర్స్ మొదట ఆయన ప్లేస్ లో MS నారాయణ గారిని తీసుకునే వారు.ఇక కొన్ని సినిమా ల తర్వాత బ్రహ్మానందం గారి ని పక్కన పెట్టి ఇతనే బుక్ చేసుకునే వారు అంటే ఈయనకి ఎంత డిమాండ్ ఉండేదో తెలుస్తుంది.కొన్ని సినిమా ల లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సీన్ లు అయితే టాప్ లేచిపోయాయి అనే చెప్పాలి.

ms

ముఖ్యముగా దూకుడు ,ఆగడు సినిమా ల లో బ్రహ్మానందం ,MS నారాయణ ల మధ్య వచ్చే సన్నివేశాల కి విపరీతమైన ఆదరణ లభించింది.అప్పట్లో బ్రహ్మానందం గారు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒకానొక సందర్భం లో MS నారాయణ నాకు మంచి పోటీ ఇచ్చాడు,నన్ను కొన్ని సినిమా ల లో తప్పించి మరి ఆయనకీ అవకాశాలు ఇచ్చారు అని చెప్పారు.1000 కి పైగా సినిమా ల లో నటించి గిన్నెస్ బుక్ రికార్డు కలిగి ఉన్న బ్రహ్మానందం గారికే భయం వచ్చేలా చేసారు అంటే MS నారాయణ గారు ఎంత మంది కమెడియన్ లో అర్ధం అవుతుంది.

ms in dookudu

919 views