Maniratnam:మణిరత్నం దగ్గర పని చేస్తున్న ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈమె పెద్ద స్టార్ హీరోయిన్!

Posted by venditeravaartha, July 24, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess the Actress: లెజండరీ దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచెయ్యడం ఏ టెక్నీషియన్ కి అయినా ఒక అదృష్టం గా భావించొచ్చు. ఎందుకంటే దర్శకత్వం లోని 24 క్రాఫ్ట్స్ మీద అవగాహనా పెంచుకోవడానికి మాత్రమే కాకుండా, ఒక క్వాలిటీ డైరెక్టర్ గా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో క్రేజీ హీరోలుగా రాణిస్తున్న రవితేజ, నాని, సిద్దార్థ్ వంటి హీరోలు కెరీర్ ప్రారంభం లో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసినవారే. ఇప్పుడు ఈ క్రింది ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ముందుగా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమై, ఆ తర్వాత దర్శకత్వం వైపు మొగ్గు చూపి, దర్శకత్వం లో ఓనమాలు నేర్చుకోవడం కోసం లెజండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద పనిచేస్తుంది. ఆమె పేరు అలీషా రెహ్మాన్.

ఈమె ప్రముఖ నటుడు రెహ్మాన్ కుమార్తె. తొలుత హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు తమిళం లో చేసింది కానీ, ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకొని మణిరత్నం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో ‘ది తగ్ లైఫ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి అలీషా రెహ్మాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలు, ఫోటోలు విడుదల అవ్వగా, అందులో అలీషా రెహ్మాన్ ఉన్నది. నాయకుడు వంటి భారీ హిట్ తర్వాత మణిరత్నం దర్శకత్వం కమల్ ఇన్నాళ్లకు మళ్ళీ నటిస్తున్నాడు.

ఈ చిత్రం లో ప్రముఖ తమిళ హీరో శింబు ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి కూడా ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అటు దర్శకుడిగా, నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.

Tags :
250 views